వివాదాస్పదం అవుతున్న ఆ జగన్ ఫోటో?

ఏపీ సీఎం జగన్ ఇటీవల జగనన్న భూరక్ష పథకం ప్రారంభించారు. దీని ప్రకారం.. అన్ని భూములను అత్యాధునికంగా సర్వే చేయించి.. పట్టాలు అందిస్తున్నారు. దీనితో ఇక భూ వివాదాలు ఉండవని జగన్ చెబుతున్నారు. అయితే.. ఈ పథకం ద్వారా ఇచ్చే పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఉండటం వివాదాలకు తావిస్తోంది. గతంలోనూ ఎన్నో ప్రభుత్వాలు పాస్ పుస్తకాలు ఇచ్చినా ఇలా చేయలేదని గుర్తు చేస్తున్నారు.

పాస్‌ పుస్తకాలపై, సరిహద్దు రాళ్లపై జగన్‌ ఫోటోలు పెట్టుకోవడం సిగ్గుచేటని టీడీపీ విమర్శిస్తోంది.  ఖాళీ భూముల కబ్జా కోసమే రీ సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సర్వే సరిహద్దుల చట్టం 1921, భూ హక్కుల చట్టం 1971, రీసర్వే అండ్‌ ల్యాండ్‌ రిజిష్టర్‌లకు సవరణలు కుట్ర కాదా అని యనమల రామకృష్ణుడు  ప్రశ్నించారు. సవరణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములు స్వాహా చేశారని యనమల రామకృష్ణుడు  ధ్వజమెత్తారు.

జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అంటే ప్రజల భూములపై జగన్‌రెడ్డికి హక్కా అని యనమల రామకృష్ణుడు  నిలదీశారు. ప్రభుత్వ తీరుతో ప్రజలు తమ భూములు ఎప్పుడు ఎవరి పేరుతో మారతాయోనని భయపడుతున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. కబ్జాలు, అవినీతి, అక్రమ కేసుల్లోనే జగన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చారని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అబద్ధాలు, అసత్యాలు తప్ప మూడున్నరేళ్లలో సీఎం సాధించిందేంటని యనమల రామకృష్ణుడు నిలదీశారు.

మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత జగన్‌ దేనని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పాలన అంత చక్కగా ఉంటే.. సభలకు వచ్చేవారిపై నిర్బంధాలెందుకని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలను, మహిళలను, విద్యార్థులను బెదిరించి సభలకు తెచ్చుకోవడమే పురోగతా అని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ బాధపడని వర్గం అంటూ ఏదీ లేదని  యనమల రామకృష్ణుడు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: