వారెవా.. ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ?

ఏపీ సీఎం జగన్‌ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో ఉన్న వారి డిమాండ్‌కు ఓకే చెప్పేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కలసి.. విజ్ఞప్తి చేయడంతో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులు గ్రేడ్ 3 ను గ్రేడ్ 2కి మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివరాలు వెల్లడించారు.

సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులు గ్రేడ్ 3 ను గ్రేడ్ 2 కు మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ మార్పు చేయాలని సీఎంను  కోరామని సచివాలయ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 11వేల మంది గ్రేడ్ 3సర్వేయర్లను గ్రేడ్  2లోకి మార్చేందుకు సీఎం అంగీకరించారని సచివాలయ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  డీఎ బకాయిలు  జనవరిలో ఇచ్చేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారని.. గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని బదిలీలకు అనుమతించాలని సీఎం ను మరోసారి కోరామని సచివాలయ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివరించారు.

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను సెప్టెంబర్ లోనే బదిలీలు చేస్తామని గతంలో  హామీ ఇచ్చినట్లు సీఎంకు తెలిపామని సచివాలయ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగడం వల్ల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు ఆగాయని సచివాలయ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివరించారు. అయితే.. గ్రామవార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలను వచ్చే ఏప్రిల్ లో చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన వివరించారు.

సీఎం నిర్ణయంపై సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘం నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్వేయర్లు ,వీఆర్వోల మధ్య  ఉన్న గ్రేడ్ తేడా ఉందని సీఎం కు తెలిపామని.. సర్వేయర్లు,వీఆర్వోల మధ్య ఉన్న గ్రేడ్ లను  సరిచేయాలని కోరగా సీఎం అంగీకరించారని వారు తెలిపారు.  సీఎం నిర్ణయంతో 10 వేల పైగా గ్రేడ్ 3  సర్వేయర్లు గ్రేడ్2సర్వేయర్లుగా మారి లబ్ది పొందుతారని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: