ప్రియుడిని మరిగింది.. మొగుడిని కిరాతకంగా చంపేసింది

కాలం మారుతోంది. భర్తలు భార్యలను హింసించే రోజుల నుంచి భార్యలు భర్తలను చంపించే రోజులు కూడా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సొంత భార్యలో ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తలను చంపించేస్తున్నారు.  తాజాగా నెల్లూరు జిల్లాలో ప్రియుడిపై మోజుతో పడి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి భార్య, మృతదేహాన్ని గోనె సంచిలో మూట కట్టి, కాలువలో పడేసింది.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో ఈ ఘటన జరిగింది. మణి, శోభా అనే దంపతులు పంటపాళెం గ్రామంలో నివాసముంటున్నారు.  రొయ్యల గుంట వద్ద కాపలాగా ఉంటూ జీవనం సాగిస్తున్న వీరికి నలుగురు పిల్లలు.  సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో భరత్ అనే వ్యక్తి ప్రియుడి రూపంలో వచ్చాడు. శోభ, భరత్ మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ కొత్త బంధం మణిని మైకంలో పడేసింది. నిత్యం ఆ మైకంలోనే ఉండిపోవాలనుకుంది. అందుకు భర్త ఆమెకు అడ్డుగా కనిపించాడు.

ప్రియుడు భరత్ పై మోజు పెంచుకున్న శోభ భర్త  అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. నాలుగు రోజుల క్రితం ప్రియుడు భరత్ తో కలసి నక్కల కాలువ వద్ద మణిని గొంతు నులిమి చంపేసింది. ఇందుకు మరో ఇద్దరు వ్యక్తులు కూడా సహకరించారు. అందరూ పక్కాగా ప్లాన్ వేసుకుని మృతదేహాన్ని  గోతం సంచిలో మూటగట్టి నక్కల కాలువలో పడేశారు.

కాలువలో గోతాం సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోగి దిగిన పోలీసులు గోతామును బయటకు తీసి మణి మృతదేహంగా గుర్తించారు. మొదట్లో భర్తను ఎవరో చంపేశారని మణి డ్రామా ఆడింది. కానీ.. పోలీసులు ప్రాధమిక విచారణలో ఈ హత్య చేసింది భార్య శోభనేనని నిర్ధారించారు. భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: