సీఎం జగన్‌ భార్యను.. ఇందులోకి ఎందుకు లాగుతారు?

ఎల్లో మీడియా తమను టార్గెట్‌ చేసి దుష్ప్రచారం  చేస్తుందని వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అంటున్నారు. రేడియంట్‌ డెవలర్స్‌కు సంబంధించి ఎలాంటి కుంభకోణం జరగలేదని వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సతీమణి వైయస్‌ భారతమ్మకు ఏం సంబంధమని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ప్రశ్నించారు.

సీఎం సతీమణి బారతి చాలా మర్యాదస్తులు, సంస్కారవంతురాలని..  ఆమె ఎప్పుడూ కూడా రాజకీయ జోక్యం చేసుకోదని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. ఎవరూ కూడా ప్యామిలీ మెంబర్స్‌ గురించి, ఆడవాళ్ల గురించి మాట్లాడకూడదని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. వేరే విషయాల్లో వైయస్‌ భారతమ్మ ఎలాంటి జోక్యం చేసుకోరని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

రెడియంట్‌ సంస్థతో తనకు 30 ఏళ్ల నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. అది రెడియంట్, వీపీఆర్‌ రెండు ప్రైవేట్‌ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందమని.. ఆ ఒప్పందంతో ప్రభుత్వానికి సంబంధం లేదని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. ఇందులో ఎలాంటి కుంభకోణం లేదన్నారు.  డాక్యుమెంట్లు క్లియర్‌గా ఉన్నాయని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందనే విషయాన్ని మరవకూడదని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ పరంగా సాయం తీసుకుని ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని.. వైయస్‌ఆర్‌సీపీలో ఉంటే వ్యాపారం చేయకూడదా అని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ప్రశ్నించారు.

టీడీపీ నేతలు మాత్రమే వ్యాపారం చేయాలా అని ప్రశ్నించిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి..  ఇలాంటి రూల్స్‌ ఎక్కడైనా ఉన్నాయా అని నిలదీశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తమను టార్గెట్‌ చేశాయని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అంటున్నారు. ఎల్లో పత్రికలపై పరువు నష్టం దావా వేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: