చైనాలో పెను సంచలనం.. అధ్యక్షుడు హౌజ్‌ అరెస్ట్?

చైనాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయా.. అక్కడ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జింగ్‌ పింగ్‌ను హౌజ్ అరెస్ట్ చేశారా.. ఆయన నుంచి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుందా.. ఇప్పుడు ఇదే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జిన్‌పింగ్‌ ను గృహ నిర్బంధం చేసినట్టు.. అధికారాన్ని సైన్యం చేజిక్కించుకున్నట్లు వదంతులు షికార్లు చేస్తున్నాయి. మాజీ మంత్రులకు మరణ శిక్షలతో చైనా రాజకీయాలు మారిపోయాయని అంటున్నారు. ఇప్పుడు చైనా నూతన అధ్యక్షుడిగా కియావోమింగ్‌ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీఅధిపతిగా ఉన్న చైనా అధ్యక్షుడు, షి జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తోంది. ఆయన్ని పదవి నుంచి కూడా తొలగించారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గుప్పుమన్న ఈ వార్తలు ప్రపంచమంతటా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే.. ఇంత జరుగుతున్నా ఈ వార్తపై చైనా ప్రభుత్వం స్పందించలేదు. అంతే కాదు.. ఆ దేశంలోని విశ్వసనీయ ప్రసార మాధ్యమాలు కూడా ఏమీ నోరు విప్పడం లేదు.

ఇదే సమయంలో ప్రపంచంలోని పెద్ద మీడియా సంస్థలు కూడా గుంభనంగానే ఉన్నాయి. కానీ.. సోషల్ మీడియా మాత్రం షేకైపోతోంది. అంతే కాదు.. చైనా రాజధాని బీజింగ్‌ చుట్టూ  పెద్దఎత్తున సైనిక వాహనశ్రేణులు మోహరించినట్లు కొన్ని వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 80 కి.మీ. పొడవైన కాన్వాయ్‌ బీజింగ్‌ దిశగా వెళ్తున్న వీడియో కలకలం సృష్టిస్తోంది.

ఇక ఇప్పుడు సైనికాధికారి లీ కియావోమింగ్‌ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టబోతున్నారట. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే చైనా రాజధాని బీజింగ్‌ నగరం పూర్తిగా సైనిక నియంత్రణలో ఉంది. అయితే మరో విశేషం ఏంటంటే.. చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్‌ జియాబావో కలిసి సెంట్రల్‌ గార్డ్‌ బ్యూరో పగ్గాలు చేపట్టాలని  స్థాయీ సంఘం మాజీ సభ్యుడు సాంగ్‌ పింగ్‌ను ఆదేశించారని ఇంకో వార్త బయటకు వచ్చింది. మరి అసలు చైనా లో ఏం జరుగుతుందన్నదానిపై అధికారికంగా మాత్రం ఏ క్లారిటీ రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: