మళ్లీ ఎన్డీఏ గూటికి తెలుగుదేశం?

మళ్లీ తెలుగు దేశం పార్టీ ఎన్డీఏ గూటికి చేరబోతోందా.. మరోసారి మోదీ, చంద్రబాబు చేతులు కలపబోతున్నారా.. మరోసారి ఎన్డీఏ పక్షంగా తెలుగు దేశం మారబోతోందా..అంటే అవుననే అంటున్నాయి జాతీయ పత్రికలు. వచ్చే దీపావళి నాటికి తెలుగు దేశం పార్టీ ఎన్డీఏ గూటికి చేరే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతుండటం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ నుంచి వెలువడే ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ అంశంపై కొత్త పొత్తా, పాత పొత్తా? అంటూ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం.. మళ్లీ తెలుగు దేశం పార్టీ ఎన్డీఏ గూటికి చేరేందుకు రంగం పూర్తిగా సిద్ధమైపోయిందట. ఈ మేరకు చంద్రబాబు నాయుడు మోడీతో మాట్లాడేశారట. అలాగే నారా లోకేష్ కూడా ఈ అంశంపై  కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో  మాట్లాడారట. ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తన కథనంలో వెల్లడించారు. ఈ కథనం ప్రకారం.. చంద్రబాబు ప్రధాని మోడీని కలిసిన సమయంలోనే నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షా ను కలిశారట.

అంతే కాదు.. తెలుగు దేశం మళ్లీ ఎన్డీఏలో చేరితే జరగబోయే పరిణామాలు ఏంటో కూడా ఈ కథనంలో రాసుకొచ్చారు. ఈ కథనాన్ని సపోర్ట్ చేసే విధంగానే ఇటీవల రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం కూడా గమనించొచ్చు. ఇప్పటికే బీజేపీకి టీడీపీ దగ్గరకాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. చాలా రోజుల తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు మొన్న ఢిల్లీలో పలకరించుకున్నారు.

అయితే.. ఆ పలకరింపు నామమాత్రమేనని అనే వారు లేకపోలేదు. కానీ.. ఆ తర్వాత కూడా పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇటీవల హైదరాబాదు వచ్చిన అమిత్‌ షా అటు రామోజీరావు ఇటు జూనియర్ ఎన్టీఆర్లతోనూ భేటి కావడం వెనుక ఇదే వ్యూహం ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబు మోదీ కౌగిట్లో చేరేందుకు తహతహలాడుతున్నారని అర్థమవుతోంది. కానీ.. బీజేపీ వైసీపీని కాదనుకుని టీడీపీకి దగ్గరవుతుందా అన్నదే అసలు ప్రశ్న. చూడాలి ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: