జగన్ టార్గెట్ ఏంటో బయటపెట్టిన రోజా?

వైసీపీ నేతలకు సీఎం జగన్ భలే టార్గెట్లు పెట్టారు. పార్టీ నేతలంతా మన గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని చెప్పారు. ఏ నేతలు పాల్గొంటున్నారు.. ఎవరు పాల్గొనడం లేదు.. అనే విషయాలపై ఆరా తీయిస్తున్నారు. దీంతో నేతలు జనంలోకి వెళ్ల క తప్పడం లేదు. తాజాగా.. మంత్రి రోజా కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరి మున్సిపాలిటీ ప‌రిధిలోని 3వ వార్డు లో మంత్రి రోజా ప‌ర్యటించారు. కశింమిట్ట సచివాలయం పరిధి లో మంత్రి రోజా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

ఇంటింటికి వెళ్లిన మంత్రి రోజా.. ఈ మూడేళ్లలో ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను లబ్ధిదారులకు చక్కగా వివరించారు. స్థానికంగా ఉండే సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి రోజా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. సీఎం జగన్ టార్గెట్ ఏంటో చెప్పేశారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోనే లక్ష్యంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలన సాగిస్తున్నార‌ని మంత్రి ఆర్కే రోజా అన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోను పూర్తి చేయడమే సీఎం ముందున్న లక్ష్యం అని మంత్రి రోజా వివరించారు. ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి రోజా తెలిపారు. జగనన్న ఇస్తున్న ప్రభుత్వ పథకాల వలన కలుగుతున్న లబ్దిని మంత్రి రోజా చెప్పారు. ప్రభుత్వం అందించే 32 రకాల సంక్షేమ పథకాలను గూర్చి మంత్రి రోజా స్పష్టంగా తెలిపారు.

గతం ప్రభుత్వం తరహాలో కాకుండా ఇప్పుడు పారదర్శకంగా జరుగుతున్న సంక్షేమ పథకాలు,  అభివృద్ధి పనులు జరగుతున్నాయని మంత్రి రోజా వివరించారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ  చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ముఖ్య పార్టీ నాయకులు కార్యకర్తలు,  అభిమానులు భారీగా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: