చంద్రబాబు భారీ ఆఫర్‌.. బయటపెట్టిన వైసీపీ మంత్రి?

రాజకీయాల్లో పార్టీ మారడాలు సహజమే. నేతలు తమ వీలును బట్టి.. రాజకీయ ప్రయోజనాలను బట్టి పార్టీలు మారుతుంటారు. అయితే.. పార్టీలు మారడానికి కూడా లంచాలు ఆఫర్ చేయడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. అలాంటి ఓ డీల్ గురించి తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఓ రహస్యం బయటపెట్టారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరాలని పీడిక రాజన్నదొరను ఆ పార్టీ నేతలు ప్రలోభ పెట్టాలని చూశారట. టీడీపీలోకి వస్తే.. 30 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారట. అంతే కాదు.. పిల్లల చదువులు చూసుకుంటామని.. అమరావతిలో ఇల్లు కూడా ఇస్తామని పీడిక రాజన్నదొరకు టీడీపీ నేతలు ఆఫర్ చేసారట.

అయితే జగన్‌పై ఉన్న నమ్మకం, అభిమానంతోనే  తాను టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని.. పార్టీ మారలేదని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. శుక్రవారం విజయనగరంలో జిల్లా స్థాయి ప్లీనరీలో ఆయన ఈ విషయం బయటపెట్టారు. అప్పట్లో వైసీపీ నుంచి చాలామంది నేతలను వైసీపీలోకి లాక్కున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. అలాంటి వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు చంద్రబాబు.. అయితే.. తాను అప్పడు ఆ ఆఫర్‌ తిరస్కరించి పార్టీలో విశ్వాసంగా కొనసాగినందుకే.. ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నానని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర  చెప్పుకొచ్చారు.

అంతే కాదు.. జగన్ సీఎం అయ్యాక  మొదటిసారి మంత్రి పదవి రానందుకు కూడా తాను అసంతృప్తి వ్యక్తం చేయలేదని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. తనకు కాకుండా పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చినా ఒక్కమాట కూడా అనలేదని  ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర  గుర్తు చేశారు. పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో స్వయంగా తెలుసుకోవాలని ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సూచించారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో టీడీపీ నేతలు గతంలో వేల కోట్లు దోచుకున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.27వేల కోట్లు మాఫీ చేశామని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: