ఏపీ: మంత్రుల సభ అట్టర్‌ఫ్లాపా.. సూపర్‌ హిట్టా?

ఏపీలో మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమైంది. మొదటగా రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే.. ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నట్టుగా టీడీపీ అనుకూల పత్రికలు రాసుకొచ్చాయి. వాస్తవానికి రాజమండ్రి బహిరంగ సభకు భారీగా ప్రజలను సమీకరించారని... డ్వాక్రా మహిళలను, ఉపాధి హామీ కూలీలను బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో సభా స్థలానికి తరలించారని సదరు పత్రికలు రాశాయి.. అయితే సభ మొదలయ్యే సమయానికి 2 వేల మంది కూడా లేకుండాపోయారని.. మంత్రులు సభాస్థలికి రాక ముందే కుర్చీలన్నీ ఖాళీ అయిపోయాయని ఆ పత్రికలు రాశాయి. సభ సాయంత్రం నాలుగు గంటలకే మొదలవ్వాల్సి ఉంది. కానీ జనాన్ని మధ్యాహ్నం 2 గంటలకే సభకు తీసుకొచ్చారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి జనానికి కనీసం అల్పాహారం కూడా ఇవ్వలేదట. దీంతో  సాయంత్రం 6 గంటల నుంచి జనం వెనుదిరగడం ప్రారంభించారట. అప్పటికి ఇంకా మంత్రులు రానేలేదు. జనం వెళ్లిపోకుండా పోలీసులు గేట్లు మూసి ఆపేశారట. దీంతో జనం వారితో వాగ్వాదానికి దిగారట. మధ్యాహ్నం రెండు గంటలకు తెచ్చి.. ఇంకెంతసేపు ఉంచుతారని అసహనం వ్యక్తం చేశారట. చివరకు రాత్రి 7.30 గంటలకు సభ మొదలయ్యే సమయానికి వచ్చిన వారిలో 20 శాతం మంది కూడా లేరని.. దీంతో సభ వెలవెలబోయందని టీడీపీ అనుకూల పత్రికలు రాసుకొచ్చాయి.

జనం లేకపోవడం వల్లే 17 మంది మంత్రుల్లో నలుగురు మాత్రమే మాట్లాడారట. మంత్రులొస్తున్నారు కొద్దిసేపు ఉండండని త్రి వేణుగోపాలకృష్ణ  చెబుతున్నా వచ్చిన జనం ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతూనే ఉన్నారట. కానీ వైసీపీ నేతలు మాత్రం తమ సభ సూపర్ పిట్ అని చెబుతోంది. వైసీపీ మంత్రులు చేప‌ట్టిన  సామాజిక న్యాయ భేరి యాత్రతో రాజమండ్రి జనసంద్రం అయిందని.. జనం ఎదురెళ్లి మరీ మంత్రుల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారని వైసీపీ మీడియా చెబుతోంది. ఈ రెండు వాదనలు చూస్తే.. వైసీపీ సభకు జనం బాగానే వచ్చారని.. అయితే.. వారిని మేనేజ్‌ చేయడంలోఇబ్బందులు తలెత్తాయని అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: