కొత్త కేబినెట్: జగన్ ఆ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్టే?

ఏపీ సీఎం జగన్.. ఓ సాహసం చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఏ సీఎం కూడా చేయని సాహసం చేస్తున్నారు. మంత్రులను మొత్తం మార్చేస్తున్నారు. ఈ విషయాన్ని జగన్ తన ప్రమాణ స్వీకారం రోజే చెప్పేశారు. మంత్రులకు తాము సగంలోనే దిగిపోతామని ప్రమాణం చేసేటప్పుడే తెలుసు. అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి మంత్రులుగా దిగిపోవాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ జగన్ తలచుకుంటే తప్పదుగా.. అందులోనూ ముందుగానే చెప్పిన విషయం కదా.

అయితే.. ఇక్కడే ఓ సందేహం చాలా మందిని వేధిస్తోంది. జగన్ తన కేబినెట్ మొత్తాన్ని మార్చేస్తాడా.. మళ్లీ అందరూ కొత్త వాళ్లనే మంత్రులుగా తీసుకుంటాడా లేక.. ఉన్నవాళ్లలో ఎవరినైనా మళ్లీ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటాడా.. ఇప్పుడు ఇదే అర్థం కాని ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. పెద్దిరెడ్డి, బొత్స వంటి కొందరు సీనియర్లను మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చని వదంతలు వినిపిస్తున్నాయి.

ఎవరికి మళ్లీ ఛాన్స్ దక్కుతుంది. ఆ అదృష్ట వంతులు ఎవరు అన్న విషయం మాత్రం క్లారిటీ లేదు.. ఇంకో వదంతి ఏంటంటే.. అసలు జగన్ ఎవరినీ కొనసాగించడం లేదట.. పూర్తిగా మొత్తం మంత్రి వర్గాన్ని మార్చేస్తున్నారట. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. జగన్ అందరు మంత్రులతో రాజీనామాలు చేయించి.. పూర్తిగా కొత్త వాళ్లను మంత్రులుగా తీసుకుంటే ఓకే.. దాంతో పెద్ద సమస్య ఉండదు.. ఎవరూ పెద్దగా ఫీల్ కారు.. ఏం చేస్తాం.. ఆయన ముందే చెప్పాడు కదా.. అయినా పదవి పోయింది మనొక్కడిదే కాదు.. కదా..అందరిదీ పోయింది కదా అని సరిపెట్టుకుంటారు.

కానీ.. పొరపాటున కొందరిని కొనసాగిస్తే మాత్రం వైసీపీలో కుంపట్లు రావడం ఖాయం.. ఎవరిని ఉంచి.. ఎవరినీ తీసేసినా అదో పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. పైకి అంతా కూల్‌గా కనిపించినా ఇలాంటి తేడాలు చూపిస్తే అది పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: