జగన్‌కు గుడ్‌ న్యూస్‌.. కేసీఆర్‌కు బ్యాడ్‌ న్యూస్?

ఏ రాష్ట్రం ప్రగతినైనా అంచనా వేయాలంటే కొన్ని గణాంకాలు, సూచీలు అవసరం.. కొన్ని కేంద్ర, రాష్ట్ర సంస్థలు.. రాష్ట్రాల ప్రగతి తీరును పరిశీలించి కొన్ని సాధికారికంగా నివేదికలు రూపొందిస్తాయి. అవి చూస్తే ఆ రాష్ట్రాల పయనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇలాంటి ఓ నివేదిక బయటకు వచ్చింది. రాష్ట్రాల ఎగుమతుల సన్నద్ధత గురించి కేంద్రంలోని నీతి ఆయోగ్‌ రూపొంచిన నివేదిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది.

సహజంగానే తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక వస్తుంది. తాజాగా ఈ ఎగుమతలు సన్నద్ధత సూచీలో తెలంగాణ పదో ర్యాంకు సొంతం చేసుకోగా.. ఏపీ అంతకంటే మెరుగ్గా 9 వ ర్యాంకు సాధించింది. సహజంగానే ఏపీలో జగన్ పాలన అంటే.. అబ్బే అభివృద్ధి లేదు.. పరిశ్రమలు లేవు.. అంతా అవినీతి అరాచకం అంటూ కొన్ని పత్రికలు ఊదరకొడుతుంటాయి.. అలాంటి ఓ పత్రికే ఇవాళ ఈనివేదకపై ఈ వార్త రాయడం విశేషం. ఆ నివేదిన బట్టి చూస్తే ఎగుమతుల సన్నద్దత సూచిలో తెలంగాణ కంటే ఏపీ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పొచ్చు.

మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఈ సూచిలో తెలంగాణ 10వ స్థానం ఉంటే.. గతేడాది ఈ రాష్ట్రం ఆరో స్థానంలో ఉండేదట. అంటే.. తెలంగాణ ర్యాంకు నాలుగు స్థానాలు దిగజారి పదో ర్యాంకు సాధించిందన్నమాట. ఇక ఏపీ విషయానికి వస్తే.. గత ఏడాది ఏపీ ఎక్కడో 20 వ స్థానంలో ఉండేది.. అక్కడ నుంచి ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 9 స్థానానికి చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే ఏపీ మంచి ప్రతిభ చూపితే.. తెలంగాణ పనితీరు గతంలో పోలిస్తే వెనకబడింది.

నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఎగుమతుల సన్నద్ధత సూచి..ఎక్స్‌పోర్ట్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇండెక్స్‌-2021 చెబుతున్న వాస్తవాలు ఇవి.. ఇక ఇదే నివేదికలో మరికొన్ని అంశాలు కూడా వెల్లడించారు.  బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగంలో మాత్రం తెలంగాణ అదరొగట్టింది.. ఈ విభాగంలో తెలంగాణ 100 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. ఇక ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌  99.50% మార్కులు సాధించి గ్రీన్ మార్క్‌ సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: