వైసీపీలో ఈ ఇద్దరు నానీల్లో మిగిలేది ఎవరు...?

VUYYURU SUBHASH
మొత్తానికి మంత్రివర్గంలో జరిగే మార్పులు గురించి ఓ క్లారిటీ వచ్చిందనే చెప్పాలి..ఎట్టకేలకు ఈ జూన్ లో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ క్లారిటీ ఇచ్చేశారు..మొదట్లోనే రెండున్నర ఏళ్లలో మార్పులు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే..కానీ మూడేళ్ళ తర్వాత జగన్ క్యాబినెట్ విస్తరణ చేస్తున్నారు. అయితే ముహూర్తం ఫిక్స్ అయింది గాని...ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారు...ఎవరిని తీసుకుంటారనేది తెలియడం లేదు...అందర్నీ తప్పిస్తేనే బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. ఒకరిని తప్పించి, ఒకరిని కంటిన్యూ చేస్తే...మంత్రి పదవి పోగొట్టుకున్నవారికి ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
కాకపోతే జగన్...కొందరిని కంటిన్యూ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది...ఈ మూడేళ్లుగా ప్రభుత్వం తరుపున బలమైన వాయిస్ వినిపిస్తున్న నేతలని..మంత్రివర్గంలో కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం..ఈ క్రమంలోనే మొదట నుంచి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరు మంత్రులు ఏ స్థాయిలో ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తారో చెప్పాల్సిన పని లేదు.
కొడాలి ఏమో చంద్రబాబుని బూతులతో ఆడుకుంటారు...అటు పేర్ని ఏమో పవన్ పై పంచులు వేస్తుంటారు...ఇలా ఇద్దరు నేతలు టీడీపీ, జనసేనలని ఆడేసుకుంటారు...మరి ఇలా పార్టీకి అండగా ఉంటూ, ప్రత్యర్ధులపై ఫైర్ అయ్యే ఈ ఇద్దరు మంత్రులని కంటిన్యూ చేస్తే బెటర్ అని వైసీపీ వర్గాల నుంచి డిమాండ్ వస్తుంది. కాకపోతే ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులే..అలాంటప్పుడు ఇద్దరినీ కంటిన్యూ చేయడం సాధ్యమయ్యే పని కాదు..వీరిలో ఒక్కరినే మంత్రివర్గంలో కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అలా చేయాల్సి వస్తే కొడాలినే కొనసాగిస్తారని తెలుస్తోంది.
ఒకవేళ అందరినీ మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఇద్దరు నానీలు సైడ్ అవ్వాలసిందే. ఇదే సమయంలో ఆళ్ళ నానిని మళ్ళీ కొనసాగించడం చాలా కష్టమని తెలుస్తోంది. ఖచ్చితంగా ఆళ్ళ నాని పదవి పోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. మరి చూడాలి కొడాలి నాని, పేర్ని నానిల్లో ఏ నాని మిగులుతారో. ఈ విష‌యం ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: