పులివెందుల టీడీపీ అభ్య‌ర్థిగా వైఎస్‌. సునీత‌...?

VUYYURU SUBHASH
దివంగ‌త మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీలో కలలకం రేపుతుంది. సీబీఐ ఛార్జి షీటు వేయడంతో ఇప్పుడు ఈ విష‌యం అధికార పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లంగా మారింది. ఈ కేసు ఎప్పుడు ఏ మ‌లుపులు తిరుగుతుందో ?  కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. రెండు రోజుల క్రితం తెలుగు దేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌డప జిల్లా టీడీపీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. పార్టీ నేత‌ల మ‌ధ్య ఎందుకు ఐక్య‌త లేద‌ని ఆయ‌న పార్టీ నేత‌ల‌ను గ‌ట్టిగా మంద‌లించారు. మ‌రోవైపు వైఎస్‌. వివేకా నంద‌రెడ్డి హ‌త్య కేసు త‌ర్వాత జ‌గ‌న్‌కు సొంత జిల్లా అయిన క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌ల నుంచే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని అన్న‌ట్టు కూడా తెలిసింది.

ఇక ఇప్పుడు క‌డ‌ప జిల్లా టీడీపీలో మ‌రో సంచ‌ల‌నం కూడా న‌మోదు అవుతుంద‌న్న చ‌ర్చ‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. క‌డ‌ప టీడీపీలో పార్టీకిస రైన లీడ‌ర్లు లేకుండా పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత
ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ లు బీజేపీలోకి వెళ్లిపోయారు. మ‌రో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి నేతల కొరత ఉంద‌న్న‌ది క్లారిటీగా ఉంది. ఈ విష‌యం చంద్ర‌బాబుకు కూడా తెలుసు.

ఇక ఇప్పుడు త‌న తండ్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు త‌ర్వాత వివేకా కుమార్తె సునీత క‌సితో ర‌గిలిపోతున్నార‌ని తెలుస్తోంది. ఆమె త‌న తండ్రిని చంపిన వారికి శిక్ష ప‌డేలా చేయాల‌ని నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌కు కూడా దూరం దూరంగా ఉంటున్నారు. సీబీఐ విచార‌ణ కోర‌డం ద్వారానే ఆమె వైసీపీని, జ‌గ‌న్‌ను ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇందుకోసం సునీత ఏ అడుగులు వేసేందుకు అయినా సిద్ధంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోను సునీత‌ను తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జిల్లాలో త‌మ‌కు బ‌లం లేక‌పోవ‌డంతో పాటు సునీత త‌మ పార్టీలోకి వ‌స్తే ఆ ప్ర‌భావం క‌డ‌ప పార్ల‌మెంటుపై ఎక్కువుగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. అందుకే సునీత మ‌న‌సులో ఏముందో క‌నుక్కునేందుకు చంద్ర‌బాబు జిల్లాకే చెందిన ఓ టీడీపీ నేత‌ను ఆమె వ‌ద్ద‌కు పంపార‌ని అంటున్నారు.

ఆమె పార్టీలోకి వ‌స్తే రెండు ఆప్ష‌న్లు ఉంటాయ‌ని అంటున్నారు. పులివెందుల టీడీపీ టిక్కెట్ లేదా, క‌డ‌ప పార్ల‌మెంటులో ఆమెకు నచ్చిన చోట పోటీచేసేలా వీలు క‌ల్పించాల‌ని బాబు భావిస్తున్నారు. ఏదేమైనా సునీత టీడీపీలో చేరాల‌న్న నిర్ణ‌యం తీసుకుంటే అది పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: