సండే ఈవెనింగ్స్ : విడిపోవ‌డం త‌ప్పా స‌ర్ !

RATNA KISHORE
ప్రేమ అనే విరుద్ధం ద‌గ్గ‌ర పెళ్లి ఓడిపోతుంది...
- ఆదివారం సాయంకాలం బోధ
 

అందంగా ఉన్న అమ్మాయి, అందంగా ఉన్నాను అనుకున్న అబ్బాయి ఇలా రెండు వేర్వేరు ఉద్వేగాలు క‌లిసిన చాలు పెళ్లి.. అవు నా! కాదా! డిఫ‌ర్ విత్ దిస్..అసలు ఏం రాసినా అంద‌మ‌యిన ఉద్వేగాలే ఉండాలి. ఉంటాయి అని కూడా  విని అని న‌వ్వుకుంటా ను.. అందం అంటే ఉద్వేగ సంబంధం దేహ సంబంధం కాదు అని క‌విత్వీక‌రించాలి.. పోయెటిక్ ఎప్రోచ్.. పెళ్లి పోయెటిక్ ఎప్రోచ్ కాదు అని కూడా అంటాను..అందుకే నాకు తెలిసి అబద్ధాల‌న్నీ ప్రేమ‌లో ఉంటాయి నిజాల‌న్నీ పెళ్లిలో ఉంటాయి అని కూడా తేల్చాను.. ఫ్రాయిడ్ కూడా నాతో ఏకీభ‌విస్తాడు..ఎందుకంటే క‌ల‌లు క‌న్నాక తేలే విష‌యం ఇదొక్క‌టే.. పెళ్లి అనే ప‌దం బూతు అని అందుకే రాశాను.. చైత‌న్య త‌ప్పుచేశాడు, స‌మంత త‌ప్పు చేయించింది.. ఇలా రాయండి ఏం కాదు..ఇలానే రాయండి ఏం కాదు.

ప్రేమ లేద‌ని అని అనుకోండి ఏం కాదు జీవితం ఒక చోట ప్రేమ లేద‌నే చెప్పిపోతుంది.. ప్రేమ అంటే  ఒక‌ మ‌నిషి త‌న‌ ఆత్మ‌నూ దేహాన్నీ ఎవ‌రికో వ‌రంగా ఉంచ‌డం. ఆత్మ‌ను దేవుడు నిర్దేశించాడు అని అంటారు. మ‌రి! ప్రేమ‌ను దేహం పంచుకున్న‌ప్పుడే మ‌గాడు నిర్దేశి స్తాడా? మ‌నుషులూ దేవుళ్ల త‌గాదాలా ఉంటాయి పెళ్లిళ్లు.. మ‌నుషులూ దేవుళ్లూ పోలిక‌ల్లా ఉంటాయి పెళ్లిళ్లు.. బాగుంటే సీతారా ముల పోలిక‌కు అంద‌మ‌యిన ప్ర‌తీక‌లు జోడిస్తారే! బాగుంది.. మ‌నుషుల‌కూ దేవుళ్ల‌కూ మ‌ధ్య అగాధాలు పెంచిన ప్రేమ‌లు కొన్ని ఉన్నాయి. అన్నీ అంద‌మ‌యిన‌వి కావు, ఆ మాట‌కు వ‌స్తే సమంత కూడా అంద‌మ‌యిన అమ్మాయి కాదు అని తేల్చాను నేను.. అందం అన్న ప‌దం అన్ సివిల్ అని అంటారేంటో మా నాంచార‌య్య.. అంటే అన‌నీ న‌వ్వుకుంటాను నేను.. అందం కాదు అందం పేరిట వ్యామోహం అన్ సివిల్ అని రాయాలి.. ఇప్పుడు ప్రేమ క్రైం ...  పెళ్లి అన్ సివిల్ వెర్ష‌న్ అని రాయాలి నేను... అనాగ‌రిక చ‌ర్య‌లో ఎన్నో త‌ప్పిదాలు ఉన్నాయి.. కనుక పెళ్లి అనే బూతు ప‌దంలో నేను అన్ సివిల్ వెర్ష‌న్ వెతికాను... ప్రేమ దేహ సంబంధ క‌లియిక‌తో నాగరిక చ‌ర్య‌లేవీ లేవ‌ని కూడా తేల్చాను. దేర్ ఈజ్ నో సివిలైజ్జ్ సెన్స్ ఇన్ ల‌వ్...
మ‌నుషులంతా ఇద్ద‌రు విడిపోవ‌డంలో ఉన్న బాధ‌నో, ఇంకొక భార స‌హిత స్థితినో అర్థం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేయాలి. చేస్తారా? డ‌బ్బున్న వారి పెళ్లిళ్ల కార‌ణంగా మీడి యాలో కొన్ని ప‌నికిమాలిన వార్త‌లు పుట్టుకువ‌స్తున్నాయి. లేదా పట్టి తెస్తున్నాయి. ఉన్న‌వారి క‌ల‌లు, లేని వారి క‌ల‌లు వేర్వేరుగా ఉన్నాయి క‌నుక మీడియా కూడా అలాంటి భేదాన్నీ, లేదా తార‌త‌మ్య‌త‌నూ ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంటుంది. వాళ్ల గోల త‌రువాత ఈమె పెళ్లి ఈమె ఇష్టం.. అత‌ని ప్రేమ అత‌ని ఇష్టం.. ఇలాంటి జడ్జ్ చేయ‌కుండా ఎందుకు మ‌నం ? తెగ ఆరాట‌ప‌డుతున్నాం.
తీర్పు..తీర్ప‌రి జ్ఞానం అని రెండుంటాయి. ఎవ‌రి వైపు తీర్పు ఇవ్వాలి. ఎవ‌రి వైపు అండ‌గా ఉండి మాట్లాడి నెగ్గుకు రాగ‌ల‌గాలి అన్న‌వి ఉంటాయి. ఎవ‌రు ఎవ‌రితో ఉండాలి. ఎవ‌రు ఎవ‌రి నుంచి హాయిగా విడిపోవ‌డం అన్న‌ది నిర్ణ‌యించుకోవాలి అన్న‌వి ఉంటాయి. మ‌నుషుల్లో కోల్పోయినంత ప్రేమ పొందినంత సుఖం అన్న‌వి బాహాటంగా వెలుగులో ఉండ‌వు. అవ‌న్నీ ఎవ‌రికి వారు పొందిన‌వి లేదా కోల్పోయిన‌వి అయి ఉంటాయి. ఆ ఇద్ద‌రూ ఏ కార‌ణంలో విడిపోయారు.

కార‌ణంలోనో, కార‌ణంతోనో ఏదో ఒక‌టి అకార‌ణం అయి ఉంటుంది. ప్రేమ అకార‌ణం అయి ఉంటుంది. ప్రేమ నుంచి పుట్టిన ప్ర‌తి భావోద్వేగం అకార‌ణం నుంచి ప్ర‌యాణించి, చివ‌రికి ఎవ‌రికి వారు వెతికే కార‌ణం ఒకటి వెలికి తీస్తుంది. ప్రేమ అంటే ఇద్ద‌రు సుఖంగా ఉండండి అని చెప్ప‌డంలో అర్థం లేదు. ఇద్ద‌రి జీవితాల‌కు కొన్ని ప్ర‌శ్న‌లు అందించిన ప్రేమ‌లు సుఖాల‌ను అందించ‌వు. పెళ్లి త‌రువాత స‌మంత చాలా బాగుంది అని అంటున్నాడు నాగ్. అవును! ఇది అత్తారిల్లు ఇచ్చిన జీవితం కాదు ఆమె సంపాదించుకున్న జీవితం. క‌నుక అది నాగ్ క్రెడిట్ కాదు.

నాగ చైత‌న్య అనే వ్య‌క్తి క్రెడిట్ కూడా కాదు. భ‌ర్త అనేది పెద్ద బ‌రువు. ప్రేమించినంత కాలంలో ఇలాంటి బ‌రువులు మ‌గాడు మోయ డు. ఉంగ‌రాలు మార్చుకున్నాక, ప్ర‌భువు దీవెన‌లు అందుకున్నాక కూడా మ‌గాడు ఇలాంటి బాధ్య‌త‌లు మోసేందుకు సిద్ధంగా ఉన్నాడా లేడా అన్న‌దే తేలిపోవాలి. దేవుడు చేసిన పెళ్లి అని అంటారు కొన్ని సార్లు. అవేవీ ఉండవు అంటే మ‌నుషులు నాస్తిక‌త్వంకు నీవు ద‌గ్గ‌రా అని అడుగుతారు. ఏ పెళ్లి అయినా ప్రేమ అయినా దేవుడుకి న‌చ్చే ఉంటాయా? అంత  న‌చ్చాక మ‌నుషులు విడిపోవ‌డంలో దేవుడి పాత్ర ఉంటుందా? ఏమో పైవాడెపుడో రాసే ఉంటాడు అని అంటారే! అప్పుడు  కూడా న‌వ్వుకుంటాను.. రాసి ఉన్న‌వాటిపై మ‌న‌కెందుకు హ‌క్కు.. వెళ్లిపోయిన సమంత బాగుంటుంది.. వెళ్లాల్సిన స‌మ‌యంలో వెళ్లిపోవ‌డం ఓ అర్థ‌వంతం అయిన చ‌ర్య.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: