మిస్ యూ శ్రీ‌దేవి : కాన‌గ‌రాని మ‌హోద‌యం

RATNA KISHORE
అందానికి మ‌హోద‌యం

భూలోకాన  ఉషోద‌యం

అవును! కొమ్మ‌లు తాకిన కోయిల

అమృతం తాగిన సోయ‌గం

ఆమే అని రాయాలి.. బ‌ర్త్ డే క‌దా

విషెస్ చెబుదాం హ్యాపీ బ‌ర్త్ డే శ్రీ‌దేవి




ఓ చిన్న ఇంట్లో శ్రీ‌దేవి ఓ పెద్ద భ‌వంతిలో శ్రీ‌దేవి మారింది విస్తృత‌మైన ప్ర‌దేశ‌మా విస్తృతికి నోచుకోని ఆలోచ‌నా తెలియ‌దు. శ్రీ‌దేవి లాంటి అందం ఆరాధ‌న‌కు కొల‌మానం.. అం తెత్తు సోయ‌గం ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ కొంద‌రు య‌వ్వ‌నిల‌కు అభిమాన పాత్రం. అవును ! కొద్ది మందికే సాధ్యం అయ్యే ఆ నీలిక‌ళ్ల  సోయ‌గానికి ఈ రోజు జ‌యంతి. మ‌న మ‌ధ్య కు మ‌ళ్లీ వ‌స్తే చూడాల‌ని ఆశ‌.. శ్రీ‌దేవికి ప్ర‌త్యామ్నాయం లేదే అన్న బాధ వెరసి వేల ఆనందాలు దూరం అయిన క్ష‌ణాల‌ను త‌ల్చుకుంటే భావోద్వేగం.. ద‌టీజ్ శ్రీ‌దేవి ...





క్ష‌ణ క్ష‌ణం.. ఆర్జీవీ ఒక పాట‌ను కంపోజ్ చేయిస్తున్నాడు ..స‌ర్!లొకేష‌న్ ని ఛేంజ్ చేయొద్దు అలానే ఉండనీయండి.. వెంక‌టేశ్ శ్రీ‌దే వీ ఆ అడ‌వుల్లో దారి త‌ప్పి తిరుగుతున్న వేళ ఓ చోట ఆగితే ఆ రాత్రి ఆ హాయి ఆ భ‌యం ఆ వెన్నెల ఆ ఆనందం ఆ భ‌రోసా అన్నీ క‌లిస్తే నా పాట .. స్వ‌ర‌వాణి కీర‌వాణి ట్యూన్ సిద్ధం అయ్యాక  నో మోర్ ఛేంజ్ .. అవు ను!శ్రీ‌దేవి అందం అడ‌వి కాచిన వెన్నెల కాదు అడ‌వినే విస్తుబోయేలా చేసిన వెన్నెల.. ఆ అందానికి వాడు ఫిదా కాలు మొక్కాడు.. క‌న్నీరు పెట్టాడు వాడి ప్రేమ వాడివ‌ర‌కే ప‌ రిమితం క‌నుక అది స్వార్థం... అది ఎంద‌రి గుండె గూటిలోనే కొలువుంది గ‌నుక అదే ప‌ర‌మార్థం. ప్రేమ ప‌ర‌మార్థాన్నే బోధించాలి. దే హ కాంతి మిరుమిట్లు గొలిపాక క‌న్నుల్లో దాగి ఉన్న రూపాన్ని అలానే ఉంచిపోవాలి.. శ్రీ‌దేవి ఇప్ప‌టికీ అలానే ఎప్ప‌టికీ అలానే చ లిగాలేం చేస్తుంది జ‌వరాలు తోడుంటే అవును శ్రీ‌దేవి లాంటి జ‌వ‌రాలు తోడుంటే ఎంత బాగుండు... అనిపించేంత అందం అది అని పించేంత అభిన‌యం అది. ఆ మేని ఛాయ సోయ‌గానికి ఎంద‌రెంద‌రో ఫిదా..

 



దేవుడిపై కోపం వ‌చ్చే సంద‌ర్భాలివి. అస‌లీ దేవ‌త‌ను భూమిపైకి పంపి మ‌ళ్లీ ఎందుకు వెన‌క్కు ర‌ప్పించుకున్న‌ట్లు. అస‌లు జీవాత్మ‌కు ఎందుకింత అల్పాయుష్షు ఇచ్చిపోయా డు. ఓ చిన్న ప్ర‌మాద‌మే ఆ మ‌ర‌ణానికి కార‌ణం అని భావించాలా.. అదొక స్వ‌యంకృత అప‌రాధం అని స‌ర్దుకుపోవాలా..మృతి వెనుక ధృతి వెనుక ద్యుతి వెనుక కాన‌గ‌రాని కార‌ణాలే కైవ‌ల్య ప్రాప్తికి కార‌ణ‌మా.. ఆ అందం లేద‌ని శోకింప‌వ‌ల‌దా?. అనివార్య‌మ‌గు మ‌ర‌ణానికి అంతిమ దారుల్లో లేని ఆనందం వెతుక్కుని పురా  స్మ‌ర‌ణ చేయాలా ఏ మో! యాలో ఉయ్యాల .. ఆ దారిని ఆ తీరునూ ఆ తెన్నునూ తెలుగు నేల మ‌రువదు.

 




కొద్దిగా కాదు ఆమెను ఎక్కువ‌గానే ప్రేమించాలి.. అందాల తీరాన మ‌హోదయా న్ని ఆహ్వానించాలి. ఒక‌ప్పుడు బుల్లిపెట్టెలో దాగున్న బుజ్జి పిట్ట ఆమె ఇప్పు డు రెక్క‌లు వ‌ చ్చాక ఎక్క‌డికో ఎగిరిపోయింది.. ఆకాశ దేశాన గాలించాలి.. అను రాగ స్వర సంచ‌యాల‌తో లాలించాలి. ఆ అందం ఇక రాదు క‌దా! కొద్దిగా అయి నా అరువు తెచ్చుకొమ్మ‌ని మేఘాల‌కు పుర‌మాయించాలి. కొద్దిగా అయినా పు లుముకొమ్మ‌ని ఆకాశ మార్గాన్ని ఆదేశించాలి.అవును అందాల‌లో ఆ అతి వ‌ని మించిన‌వారు లేరు. అభిన‌య తీరాన ఆ తార‌ను మించిన వారు లేరు. కొమ్మ‌ ను తాకిన కోయిల అని అంటారే అలా ఉంటుందా గండు కోయిల.. ఆ అతి లోక సుంద‌రి మ‌న‌ల్ని విడిచి యాడ‌నో! ఈ పాటికే స్వ‌ర్గం చి న్న‌బోవాలి.. ఈ పాటికే ఇంద్రుడో చంద్రుడో క‌న్నురెప్ప‌ల ఆర్ప‌క ఆ అందం వైపు త‌దేకంగా చూస్తూ ఉం డాలి.కోట‌లు దాటి బాట‌లు దాటి మేఘాల ప‌ల్ల‌కిలో చేరిన దివ్య సుంద‌ రిని చూ సి ఏమాయె నా క‌విత అని అక్క‌డున్న‌వారంతా పాడుకోవాలి. ఈ సారి ఆ అం దానికి సాహోరే అనే స్వ‌రాల సంఖ్య పెరిగే తీరాలి. ఈ వేళ ఆమెకు నివాళులివే..



- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: