హెరాల్డ్ ఎడిటోరియల్ : జనసైనికులను ఎందుకు టార్గెట్ చేశారో తెలుసా ?

Vijaya
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో సీన్ అర్ధమైపోయినట్లుంది. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తండ్రి, కొడుకులు కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఉపఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని, ఉపయోగపడని అంశాలను కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయినా జనాల్లో పెద్దగా రెస్పాన్సు వస్తున్నట్లు అనిపించటంలేదేమో. అందుకనే ప్రత్యర్ధిపార్టీకి మిత్రపక్షంగా ఉన్నాసరే పవన్ కల్యాణ్ అభిమానులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. వకీల్ సాబ్ సినిమాకు ప్రీమియర్ షోల పేరుతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యుటర్లు తమిష్టం వచ్చినట్లు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ప్లాన్ చేశారు. దాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. ఈ విషయాన్నే చంద్రబాబునాయుడు పవన్ పై ప్రభుత్వం రాజకీయంగా కక్షసాధింపంటు నానా గోల చేశారు.



ప్రభుత్వంపై పవన్ అభిమానులను ఎంతగా రెచ్చగొట్టాలని చంద్రబాబు ప్రయత్నించినా పప్పులుడకలేదు. ప్రభుత్వ నిర్ణయంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసింది. గతంలో పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయంటే దాదాపు వారంపాటు ఎగ్జిబిటర్లు తమిష్టం వచ్చినట్లు ధరలు పెంచేసేవారు. అయితే ఆ పద్దతిని ప్రభుత్వం అడ్డుకుంది. ఎగ్జిబిటర్ల ఇష్టానికి వదిలేస్తే టిక్కెట్ల ధరలు పెంచేసి ప్రేక్షకులు లేదా సినిమాప్రియుల జేబులను గుల్లచేసేసేవారు. అందుకనే ప్రభుత్వం టికెట్ల ధరల పెంపును అడ్డుకుంది. దీనిపై ఎగ్జిబిటర్లు కోర్టుకెళ్ళారు. సింగిల్ బెంచ్ అనుకూలంగా తీర్పిచ్చింది. వెంటనే ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసింది. ఇక్కడ న్యాయస్ధానం ప్రభుత్వ వాదననే సమర్ధించింది.



టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతిస్తే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యుటర్లు అంటే వ్యక్తులుగా మాత్రమే లాభపడతారు. అదే ధరలపెంపును అడ్డుకుంటే జనాలంతా హ్యాపీ. ఇంతచిన్న విషయాన్ని కూడా చంద్రబాబు చాలా పెద్దదిగా చేసి ఏకంగా సినిమానే అడ్డుకున్నంతగా పవన్ అభిమానులను రెచ్చగొట్టారు. తాను అధికారంలో ఉన్నపుడు రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజునే అడ్డుకున్న చంద్రబాబు ఇపుడు ప్రభుత్వాన్ని నిలదీయటం ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయమై బీజేపీ నేతలు కూడా నానా గోల చేస్తున్నారు. కమలనాదులు గోల చేస్తున్నారంటే అర్ధముంది. ఎందుకంటే పవన్ వాళ్ళ పార్టనర్ కాబట్టి. పైగా ఉపఎన్నికలో నాలుగు ఓట్లు పడాలంటే అది పవన్ వల్లే అవుతుంది. అందుకనే వాళ్ళు అంతగా గోల చేశారు. మరి పవన్ ఏమి చంద్రబాబుకు పార్టనర్ కాదే. అయినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకింతగా గోల చేశారు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: