హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ రోగులను ఆదుకోవటానికి జగన్ కీలక నిర్ణయం

Vijaya
కరోనా వైరస్ మరణాల రేటును తగ్గించేందుకు జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరినా విషమ పరిస్ధితులను ఎదుర్కొటున్న రోగులకు భరోసా ఇచ్చేందుకు ఉపయోగించే రెండు యాంటీ వైరల్ డ్రగ్స్ ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి విడత ఆర్డర్ వచ్చేసింది. రెండో విడత ఆర్డర్ కూడా తొందరలో రానున్నది. విషమ పరిస్ధితుల్లో ఉన్న వారికి రెమ్ డెసివిర్, టోసీలిజుమట్ అనే ఇంజెక్షన్లు ఇస్తారు. నిజానికి ఈ ఇంజక్షన్లు రాష్ట్రంలో కొరతగా ఉంది. అందుకనే పై రెండు ఇంజక్షన్లను తయారు చేసే ఫార్మాసూటికల్ కంపెనీ హెటిరో డ్రగ్స్ యాజమాన్యంతో ప్రభుత్వం చర్చించింది. అవసరాన్ని వివరించి పెద్ద ఎత్తున డోసులను సరఫరా చేయటానికి ఒప్పించింది.

ప్రభుత్వంతో చర్చల కారణంగా రెమ్ డెసిఫిర్ ఇంజక్షన్లు 5 వేల డోసులను కంపెనీ సరఫరా చేసింది. వచ్చిన ఇంజక్షన్లను జిల్లాల్లోని అవసరాల ఆధారంగా ప్రభుత్వం అన్నీ జిల్లాలకు సరఫరా చేసేసింది. అయితే వచ్చిన డోసులు ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ఒకవైపు కేసులు వేల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. దాంతో పాటు మరణాల రేటు కూడా నెమ్మదిగా పెరుగుతోంది. అందుకనే పై రెండు ఇంజక్షన్ల సరఫరాను మరింతగా పెంచాలని ప్రభుత్వం హెటిరో డ్రగ్స్ యాజమాన్యాన్ని గట్టిగా కోరింది. దాంతో ఆగష్టు మూడో వారంలోగా మరో 90 వేల డోసులను ప్రభుత్వానికి అందచేయనున్నట్లు కంపెనీ ప్రామిస్ చేసింది.  మొత్తం మీద 2 లక్షల డోసులను నిల్వ చేసుకుని కోవిడ్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు సరిపడా నిల్వలను అందించాలని జగన్ ఆదేశించాడు. పనిలో పనిగా రెమ్ డెసిఫిర్ తో పాటు టోసీలిజుమట్ ఇంజక్షన్లు కూడా సరఫరా చేయనున్నది కంపెనీ.

ఒకవైపు వైరస్ వ్యాప్తిని తగ్గించటానికి ప్రభుత్వం అన్నీ విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. రోగులను ఐడెంటిఫై చేయటానికి ర్యాండమ్ పరీక్షలు చేయిస్తోంది. కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచటంతో పాటు అందులో బెడ్లను, వెంటిలేటర్ల సంఖ్యను కూడా పెంచుతోంది. డాక్టర్లు, వైద్య సిబ్బందికి అవకాశం ఉన్నంతలో  పిపిఇ కిట్లను కూడా సరఫరా చేస్తోంది. అవసరం అనుకున్న ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులను కూడా తన ఆధీనంలోకి తీసేసుకుంది. ప్రైవేటు నర్సింగ్ హోంలు, క్లినిక్కుల్లోని బెడ్లలో కొన్నింటికి ఇప్పటికే స్వాధీనం చేసేసుకుంది. డాక్టర్లు, వైద్య సిబ్బందిని 24 గంటలూ పని చేయిస్తోంది. అదే సమయంలో మరికొందరు వైద్య సిబ్బంది ర్యాండమ్ టెస్టుల కోసం ప్రజల దగ్గరకే పంపుతోంది. క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డల్లోని రోగులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు శక్తిమేరకు ఖర్చు పెడుతోంది. అయితే ఇంత చేస్తున్నా ఎక్కడో ఓ చోట లోపం కనబడుతునే ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చిన్న చిన్న లోపాలను పట్టుకుని చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా,  ప్రతిపక్ష నేతలు బూతద్దంలో  చూపించి నానా యాగీ చేస్తున్నారు. వైరస్ ను అరికట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇందుకు జగనే బాధ్యత వహించాలనే పిచ్చి డిమాండ్లతో హోరెత్తించేస్తున్నారు. విషయం ఏదైనా కానీండి అధికారంలో ఉన్న వాళ్ళు కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎలా బాధ్యత వహిస్తారు ? పోనీ ప్రతిపక్షాలేమైనా ఈ సమయంలో సంయమనం పాటిస్తున్నాయా ? జనాలకు, రోగులకు భరోసా ఇచ్చేట్లుగా వ్యవహరిస్తున్నాయా అంటే అదీ లేదు. పొద్దున లేచింది మొదలు జగన్ను తిట్టడం, ప్రభుత్వం ఫెయిలైందని ఆరోపించటం, జనాలను భయపెట్టటమే టార్గెట్ గా పనిచేస్తున్నాయి. సరే ఎవరు పనిచేస్తున్నారు ? ఎవరు ఫెయిలయ్యారనే విషయంలో జనమే కదా అంతిమ తీర్పరులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: