జ‌గ‌న్‌ని న‌డిపిస్తున్న‌ రాజ‌కీయ గురువు ఎవ‌రో తెలుసా?

R Bhanu

గురువు లేని విద్య గుడ్డిద‌ని అంటారు. అది ఏ విద్య అయినా కావొచ్చు.. ఆఖ‌రుకు అత్యంత కీల‌క‌మైన రాజ‌కీ య‌మైనా స‌రే.. ఎవ‌రో ఒక‌రు చేయి ప‌ట్టుకుని మొద‌టి అడుగులు వేయించాల్సిందే. మ‌రి ఇలా ఏపీ సీఎంగా పిన్న వ‌య‌సులోనే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌.. కు కూడా రాజ‌కీయంగా ఎవ‌రో ఒక‌రు గురువు ఉండే ఉండాలి క‌దా! ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది అస‌లు ఈ కోణంలో ఆలోచించి ఉం డరు. ఆయ‌నే సొంత‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.. ఆయ‌నంత‌ట ఆయ‌నే ఎదిగారు.. ఆయ‌న స్వ‌యంగా అడు గులు వేశారు.. అని అంద‌రూ చెప్పుకొంటున్నారు. కానీ, వాస్త‌వానికి జ‌గ‌న్‌కు కూడా రాజ‌కీయ గురువు ఉన్నారు.


జ‌గ‌న్‌ను చేయి ప‌ట్టుకుని రాజ‌కీయాల్లోకి అడుగులు వేయించారు. రాజ‌కీయాల్లో ఎలా మెల‌గాలో.. ప్ర‌జ‌ల‌తో ఎలా మ‌మేకం అవ్వాలో.. నిజ జీవితానికి రాజ‌కీయాల‌కు మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం ఏంటో.. జీవితంలో ఎలా మెల‌గాలో.. ప్ర‌జాజీవితంలో ఎలా ఉండాలో అక్ష‌రం .. అక్ష‌రం.. నేర్పించారు ఆ గురువు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌ని ఈ విష‌యాన్ని.. జ‌గ‌న్ మాతృమూర్తి.. విజ‌య‌మ్మ‌.. స్వ‌యంగా తాను రాసుకున్న `నాలో..నాతో.. వైఎస్సార్‌` పుస్త‌కంలో సోదాహ‌రణంగా వివ‌రించారు. జ‌గ‌న్ కు 18 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే.. రాజ‌కీయాల్లోకి రావాల‌నే కోరిక ఉండేద‌ని విజ‌య‌మ్మ పేర్కొన్నారు. ``చూడ‌మ్మా.. నాన్నిని ఎంత‌మంది ఆరాధిస్తున్నారో.. నా క్కూఆ ఆయ‌న‌లా మంచిప‌నులు చేస్తూ.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఉండాల‌ని ఉంద‌మ్మా!``
అని త‌న త‌ల్లి చెవిలో నిత్యం చెప్పేవారు. 


అయితే, అప్ప‌టికే రాజ‌కీయాల్లో ఉన్న వైఎస్ ప‌డుతున్న క‌ష్టాలు, ప్ర‌త్య‌ర్థుల నుంచి వ‌స్తున్న విమ‌ర్శల ను ప్ర‌త్య‌క్షంగా చూసిన విజ‌య‌మ్మ‌.. జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌వేశంపై వ‌ద్ద‌ని త‌లుపులు మూసేశారు. కానీ, ఈ విష‌యం మెల్ల‌గా వైఎస్ చెవిలో ప‌డింది. దీంతో ఆయ‌నే జ‌గ‌న్‌కు గుర‌వ‌య్యారు. మెల్ల‌మెల్ల‌గా రాజ‌కీయం వైపు జ‌గ‌న్‌తో అడుగులు వేయించారు. ``రాజ‌కీయాల్లో ఉండాలంటే.. ధైర్యం ఉండాలి. నిబ్బరం ఉండాలి. అన్నీ పోగొట్టుకున్నా కూడా ఇచ్చిన మాట‌కు నిల‌బ‌డాలి. మ‌న‌ల్నిన‌మ్ముతున్న వాళ్లకి తోడుగా నిల‌వాలి. అప్పుడే నీకు వాళ్లు తోడుగా ఉంటారు. మ‌న‌తో క‌ష్టాలు చెప్పుకోవాలి అనుకుని చాలా మంది వ‌స్తూంటారు. అంద‌ర్నీ ఓపిక‌గా ప‌ల‌క‌రించాలి. ఎవ‌రినీ అశ్ర‌ద్ధ చేయొద్దు. అంద‌రినీ ప‌ల‌క‌రించాలి`` ఇదీ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. జ‌గ‌న్ చేసిన తొలి రాజ‌కీయ బోధ‌! 


అప్ప‌టి నుంచి జ‌గ‌న్ మ‌న‌సులో నిత్యం రాజ‌కీయ సంఘ‌ర్ష‌ణే చోటు చేసుకుంది. ఆ ప్ర‌భావ‌మే ఆయ‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసింది. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డేలా చేసింది. ప్ర‌జ‌లంటే ఏమిటో తెలిజేసింది. ఇక‌, 2009లో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు కూడా ఆయ‌న ఎక్క‌డా వైఎస్ ఫోటోను వినియోగించ‌లేదు. స్వ తంత్రంగానే ప్ర‌చారానికి వెళ్లారు. ఇక‌, త‌ర్వాత సొంత‌గా పార్టీని స్థాపించారు. అనంత‌రం.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లా రు. రాజ‌కీయ గురువుగా త‌న తండ్రి వైఎస్ చెప్పిన మాట‌లు, చేసిన బోధ‌, చూపించిన మార్గంలోనే ఆయ‌న న‌డిచారు. ఓదార్పు యాత్ర  చేసినా, ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేసినా.. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డం, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి భ‌రోసా ఇవ్వ‌డం వంటివి గురువు చూపిన బాట‌ను అనుస‌రించ‌డంలో చేస్తున్న ప్ర‌క్రియే. మొత్తానికి గురువు త‌గ్గ శిష్యుడిగానే కాకుండా గురువును మించిన శిష్యుడిగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నార‌న‌డంలో సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: