అప్పుడే జనంలోకి వస్తున్న జగన్..? వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారా?

Chakravarthi Kalyan

సాధారణంగా అధికార పక్షానికి కొంత సమయం ఇవ్వాలి.  రెండు సంవత్సరాలైనా అయితే వారి పాలనా వైఫల్యాలు బయటపడతాయి. వాటిని ఎండగట్టడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలి.  కానీ జగన్ మాత్రం కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం లేదు.  ఆరు నెలల వ్యవధి ఇచ్చారు.  సరిగ్గా పాలించడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు.  జనవరి మూడో వారంలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. వారానికి జిల్లాలో రెండు రోజులపాటు బస చేయాలని చూస్తున్నారు. 26 జిల్లాలను చుట్టేయాలని భావిస్తున్నారు.



దీనిపై వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ప్రజలు కూటమి పాలన కోసం ఎదురుచూస్తున్నారు. తొలి ఆరు నెలలను ఎవరు పరిగణలోకి తీసుకోవడం లేదు. కానీ జగన్ మాత్రం ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు. అయితే ప్రజల నుంచి రివర్స్ అవుతుందేమోనన్న ఆందోళనలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి.



సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని నిలదీస్తున్నారు.  అదే విషయాన్ని ప్రజల మధ్యకు వచ్చి ప్రశ్నిస్తానని చెబుతున్నారు. కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. వైసిపి హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు జగన్. కానీ ప్రజలు మాత్రం ఆయన సంక్షేమానికి ఓటు వేయలేదు. అభివృద్ధి లేకపోవడాన్ని మాత్రమే గుర్తించారు.  అందుకే వ్యతిరేకంగా ఓటు వేశారు. అటువంటిది ఆరు నెలలైనా కాలేదు.. సంక్షేమ పథకాలు అమలు చేయలేదంటే ఎలా? అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి.  ప్రజలే సర్దుబాటు ధోరణిలో ఉన్న నేపథ్యంలో.. విపక్ష నేతగా జగన్ జనం మధ్యకు వచ్చి ఎలా నిలదీస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.


ప్రాధాన్యతా క్రమంలో కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది.  పల్లె పండుగ పేరుతో రూ. 4,500 కోట్లతో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రహదారులు దెబ్బతిన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.  అవే రహదారుల పైకి వచ్చి జగన్ ప్రశ్నిస్తే..ప్రజలు కూడాతిరగబడతారని, నిలదీస్తారని వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయి. కేవలం రాజకీయ హడావిడి తప్ప..జగన్ పర్యటన క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కూటమి ప్రభుత్వానికి మరి కొంత సమయం ఇచ్చి.. అప్పుడు జనం బాట పడితే బాగుంటుందని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: