ఆ విషయంలో చంద్రబాబుని పక్కన పెట్టి మరీ పవన్ ప్రాధాన్యం ఇస్తున్న మోదీ?

Chakravarthi Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కీలకమైన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  అలాగే మోదీ, అమిత్‌ షా టీంలో కూడా పవన్ ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో బీజేపీకి ఇష్టమైన సనాతన ధర్మాన్ని పఠిస్తున్నారు.


శ్రీవారి లడ్డూ కల్తీ అయింది అన్న దాని మీద ఏకంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు.  దేశానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు అవసరం అన్నారు. ఆయన ఈ మేరకు వారాహి డిక్లరేషన్ చేశారు. హిందూత్వకు ప్రాణం ఇచ్చే బీజేపీకి అనుగుణంగా పవన్ కూడా మాట్లాడుతున్నారని వామపక్షాలు ఇతర సంఘాలు విమర్శలు కూడా చేశాయి.  బీజేపీకి పవన్ మీద మరింత గురి కుదిరింది అని అంటున్నారు.


మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం అని అంటున్నారు.  దాంతో సర్వ శక్తులను అక్కడ ఒడ్డుతున్న బీజేపీ తన వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలు అన్నీ ప్రయోగిస్తోంది.  భారీ ఎత్తున ప్రచారం చేపట్టడానికి బీజేపీ, మోడీ టీం ని తయారు చేశారు అని అంటున్నారు.  జనసేన అధినేత పవన్ ని కూడా తమ టీం లోకి తీసుకున్నారనే ప్రచారం ఉంది.


పవన్ కి ఉన్న సినీ గ్లామర్ తో పాటు ఆయన సనాతనవాదిగా మారిన తరువాత అగ్రెస్సివ్ మోడ్ లో ఇస్తున్న స్పీచులతో ఈసారి ఉత్తరాది ఊగిపోతుందని కూడా లెక్క వేస్తున్నారు.  దాంతో పవన్ ని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి దింపుతారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద వ్యాఖ్యలతో ఆయన ఒక్కసారిగా నేషనల్ ఫిగర్ గా మారిపోయారు.



దీంతో పవన్ కి ఉత్తరాదిన ఆదరణ వేరే లెవెల్ లో ఉంటుందని అంతా ఊహిస్తున్నారు.  పవన్ కనుక మహా ఎన్నికల సమరంలోకి దూకితే అది జనసేనకు బీజేపీకి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచుతుందని అంటున్నారు.  రానున్న రోజులలో ఏపీతో పాటు దేశంలో జరిగే అనేక రాజకీయ మార్పులకు కూడా దారి తీస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కి బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్ద పీట వేస్తోందని ఆయనను అత్యంత నమ్మకమైన మిత్రుడిగా చూస్తోందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: