హరియాణాలో బీజేపీ పరిస్థితికి ఆమే కారణమా? తెగ బాధ పడుతున్న మోదీ..!
మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకుంటే రోడ్డెక్కాల్సిన పని లేదు. దుస్తులు చిరిగిపోయినా.. న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన పని లేదు. జుట్టు పట్టుకొని ఈడ్చినా అణిమణికి ఉండాల్సిన ఆగత్యం లేదు. ఒకసారి మమ్మల్ని ముస్లింలు అన్నారు. మరోసారి పాకిస్థాన్ మద్దతు దారులమని ఆరోపించారు. ఇంకోసారి ఖలీస్థానీ సానుభూతిపరులమని విమర్శించారు. ఇన్ని కోణాల్లో చెడు ముద్రలు వేశారు. బీజేపీ పెద్దలకు ఒకటే చెబుతున్నాన.. ఇకపై ఇలాంటి రాజకీయాలు నడవవ్..
ఇవి ఏ సీనియర్ రాజకీయ నాయకుడో చేస్తున్న విమర్శలు కావు.. తొలిసారి బరిలో దిగిన, నిన్నటివరకు అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఉన్న మహిళ వ్యాఖ్యలు. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో పతకం కోల్పోయిన రెజ్లర్ వినశ్ ఫోగట్ చేస్తున్న పదునైన దాడి. దీంతో హరియాణాలో బీజేపీ గుక్క తిప్పుకోలేని పరిస్థితి లో ఉంది. ఎన్నికల్లో ప్రత్యర్థిని ఇంతగా పట్టు పట్టేస్తున్న రెజ్లర్ దెబ్బకి బీజేపీ అబ్బా అంటోంది.
హరియాణా ఎన్నికల ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వినేశ్ ఫొగట్ జింద్ జిల్లాలోని జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తాను రాజకీయాలను అవకాశంగా తీసుకుని రాలేదని.. తన అవసరం ఉందనే వచ్చాను అన్నారు. తన పోరాటం కేవలం రెజ్లింగ్ వరకే పరిమితం కావొద్దని ప్రజల కోస్ం కూడా కొనసాగించాలని చాలామంది కోరారని చెబుతోంది.
భవిష్యత్తు కోసం తన శక్తిని అట్టిపెట్టినట్లు తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా తాను పోరాడినప్పుడు చిన్నచూపు చూశారని.. అవమానించారని వినేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం తరఫున ఎన్నో పతకాలు సాధించి,, గుర్తింపు తెచ్చుకున్న తాను చాల సులభంగా ఏదో ఒక పార్టీ తరఫున రాజకీయాల్లోకి వచ్చేదానిని అని అన్నారు. అయితే బ్రిజ్ భూషణ్ వంటి వారిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. తమపైనే అబద్దాలు చెబుతున్నారంటూ నిందలు వేసిందని తప్పు పట్టారు. వీటితో పాటు పలు విమర్శలు, మాటలతో బీజేపీని కడిగేస్తున్నారు. దీంతో ఆ పార్టీకి ఏం చెప్పాలో పాలుపోవడం లేదు.