వామ్మో! నిమిషానికి 17 వేలా ? కవిత బెయిల్ కోసం ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాక్ అవుతారు?
ఔను మీరు చదివింది నిజమే. ఒక సగటు కార్మికుడు లేదా సగటు ఉద్యోగి నెలలో సంపాదించుకునే జీతం సగటున 20 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. కానీ ఆయన నిమిషానికే రూ.17 వేలు ఛార్జ్ చేస్తారు. ఆయనే ముకుల్ రోహత్గీ.
దేశంలో ఈయన పేరు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. క్లిష్టమైన సంచలన కేసులు.. అసలు ఈ కేసుల్లో ఇరుక్కుపోవడం ఖాయం అని నిర్ధారించుకున్న కేసుల్లోను ఆయన తన వాగ్ధాటి.. న్యాయ నైపుణ్యం.. రాజ్యాంగ పరమైన అంశాలను జోడించి అనేక కేసులను విజయవంతంగా పూర్తి చేశారు. ఆయనే తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇరుక్కుపోయి విలవిల్లాడిన దిల్లీ మద్యం కుంభకోణంలో సునాయసంగా బయటకు తీసుకువచ్చారు.
ఏపీలో చంద్రబాబు అరెస్టు చేసి జైల్లో ఉంచినప్పుడు ఆయనకు బెయిల్ కోసం వాదించి బయటకు తీసుకువచ్చిన వారిలో ముకుల్ రోహత్గీ ఒకరు. అదే విధంగా పలువురి రాజకీయ ప్రముఖుల కేసుల్లోను ఆయన తన వాదనలు వినిపించారు. ఆయా కేసుల్లో వారికి ఊరట కల్పించారు. ఆయన కోర్టు హాల్లోకి వస్తుంటే రాజ్యాంగం.. న్యాయ దేవత నడిచి వచ్చినట్లే ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సదాశివం కొన్నేళ్ల క్రితం అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. చిత్రం ఏంటంటే వైసీపీ అధినేత జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించిన వారిలో రాం జెఠల్మానీ తర్వాత రోహత్గీదే కీలక పాత్ర.
అందుకే ఏరికోరి బీఆర్ఎస్ అధినేత ముకుల్ రోహత్గీని ఎంపిక చేశారు. ఆయన కుటుంబం అంతా 60 ఏళ్లకు పైగా న్యాయ వ్యవస్థలోనే ఉంది. ఆయన తండ్రి, భార్య, పిల్లలు కూడా న్యాయవాదులుగా నే కాక.. సొలిసిటర్ జనరల్ వంటి పదవులు కూడా చేశారు. గంటకు రూ.10 లక్షల ఛార్జి వసూలు చేసే రోహత్గీ కేసు తీవ్రతను బట్టి అమౌంట్ మారుతూ ఉంటుంది. ఆయన ఎంత సేపు వాదనలు వినిపిస్తే ఆ సమయానికి లెక్కించి ఛార్జి తీసుకుంటారు. వీటితో పాటు అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.