బ్రిటన్‌లో ముసుగు దొంగల విజృంభణ.. ఎవరి పని?

Chakravarthi Kalyan
బ్రిటన్ లో వలసదారులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఈ హింసాత్మక ఘటనలు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. బ్రిటన్ లోని వీధుల్లో ఆందోళనకారులు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలు శరణార్థులు, అలాగే ఒక మతానికి చెందిన సమూహమే లక్ష్యంగా సాగుతున్నాయని అక్కడి భద్రతా వర్గాలు తెలిపాయి.

అయితే ఈ ఘటనలకు మూల కారణం ఏంటంటే.. ఉత్తర పశ్చిమ ఇంగ్లాండ్ లో ముగ్గురు బాలికలను ఒక స్థానికేతర వలసదారుడు కత్తితో పొడిచి చంపిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ దాడిని ఆపేందుకు యత్నించిన ఇద్దరు టీచర్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనతోనే హింస చెలరేగినట్లు పలు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ హింసకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా హింస ప్రజ్వరిల్లింది. దీంతో నిరసన కారులు లివర్ పూల్లోని వలసదారులకు చెందిన దుకాణాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నారు.

ముగ్గురి బాలికలపై వలస వచ్చిన శరణార్థి దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తరుణంలో అల్లర్లు మిన్నంటాయి. అయితే బ్రిటన్‌లో జరుగుతున్న ఆందోళన పలు నగరాలకు వ్యాపిస్తోంది. దీనిపై ఆ దేశ ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వలసదారులు ఆశ్రయం పొందుతున్న హోటళ్లను గుర్తించి మరీ దాడులు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా లివర్ పూల్ ఆందోళన కారులు ఏకంగా పోలీసు అధికారి మోటార్ సైకిల్ ను అడ్డగించి అతడిపై దాడి చేశారు. లండన్ సమీపంలో హల్ అనే పట్టణంలో ఒక షూ దుకాణానికి నిప్పు పెట్టారు. అయితే ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చర్మం రంగు చూసి శరణార్థులపై జాత్యంహాంకార దాడులు జరుగుతున్నాయని బ్రిటన్ లోని పలువురు మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరికొందరు ముసుగు వేసుకొని ఆందోళన చేస్తున వారిపై కత్తితో, రాడ్లతో దాడి చేస్తున్నారు.  మరి ఈ ముసుగు దొంగలు ఎవరు. ఎందుకు దాడులు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: