రోజా ప్లాన్ అంతా నాశనం చేస్తున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan
వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవ లేదు. పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేశ్ ఇలా చాలా మంది ఉన్నారు. అదే మహిళా జాబితాకు వస్తే… ఠక్కున రోజా గుర్తుకు వస్తారు. ఆమె జగన్ పై ఏ చిన్న ఆరోపణలు చేసినా.. తిప్పి కొట్టేది.  ఆమకు జగన్ మొదటి క్యాబినెట్ లోనే అవకాశం దక్కుతుందని భావించినా.. కొన్ని సామాజిక కారణాలతో రాలేదు.

కానీ ఆమెకు నామినేడెట్ పోస్టు ఇచ్చారు. ఆ తర్వాత రెండన్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరిగింది.  జగన్ రెండో క్యాబినెట్ లో ఆమె టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  ఈమె మంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖలో రుషికొండపై  సుమారు రూ. 500 కోట్లతో విలాసవంతమైన భవనాలను నిర్మించారు.  అత్యంత విలాసవంతమైన భవనాలు, లక్షల ఖరీదైన ఫర్నీచర్, ఇంటీరియర్ డెకరేషన్, బీజ్ వ్యూ వంటి రాజ భవనాలను తలపించేలా నిర్మాణం ఉంది.

దీనిని టూరిజం కోసం కట్టామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ లాంటి ప్రముఖులు వచ్చినప్పుడు బస చేసేలా అన్ని సౌకర్యాలతో దీనిని నిర్మించినట్లు రోజా చెప్పుకొచ్చారు. అయితే దీనిని అద్భుత నిర్మాణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతితో నిర్మించిన భవనాలతో పోల్చితే అతి తక్కువ ధరల్లో చాలా నాణ్యంగా కట్టారు. ఇందులో ప్రస్తుతం సీఎం కూడా ఉండొచ్చు. ఇదే సమయంలో మంత్రి రోజా టూరిజం అభివృద్ధి కోసం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు.  

పర్యాటక హోటళ్లు, రిసార్ట్ల ఆధునికీకరణకు ఆమె శ్రీకారం చుట్టారు. అందులో  కొన్నింటిని ఇప్పుటి ప్రభుత్వం అడ్డుకుంటోంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవాడ దగ్గర ఉన్న పార్కు లోని స్థలాన్ని కార్పొరేషన్  అధికారులు 2001లో ఏపీటీడీసీ కి అప్పజెప్పారు. కానీ రిజిస్ర్టేషన్ చేయలేదు. దీంతో ఇప్పుడు దానికి లోన్ ఆగిపోయింది. మొత్తం రూ.150 కోట్ల అంచనాతో హోటళ్ల ఆధునికీకరణ కార్యక్రమాన్ని రోజా ప్రారంభించారు. ఇందులో 15-20 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి. టూరిజాన్ని అభివృద్ధి పరిచేందుకు రోజా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాకపోతే ఇవేమీ బయటకు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: