మోడీ జాగ్రత్త: భారత్‌కు పొంచిఉన్న అతి పెద్ద ముప్పు?

Chakravarthi Kalyan
జమ్మూ కశ్మీర్ లో గత సుమారు నెల రోజుల వ్యవధిలో 9 దాడులు జరిగాయి. ఇందులో 12 మంది సైనికులు, పది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఎప్పుడు చెక్ పడుతుందా అని అంతా వేచి చూస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఉనికిపై భారత్ ఆర్మీ, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.
అయితే జమ్మూ ప్రాంతంలోని మత పరమైన విధ్వంసాలను ఉపయెగించుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని.. అందుకే ఉగ్రవాదుల దాడులకు పాల్పడుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక కశ్మీర్ లో శాంతి నెలకొనడం పాకిస్థాన్ కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులు పంపించి.. ఇక్కడ దాడులు చేయిస్తోంది అని భారత్ ఆర్మీ చెబుతోంది.  ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో మత పరమైన విధ్వంసాలు ప్రేరేపించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా యత్నిస్తోందని  అంటున్నారు.
భారత్ లో దాడులు చేసేందుకు రిటైర్డ్ పాక్ ఆర్మీ అధికారులతో ఉగ్రవాదులు శిక్షణ తీసుకుంటునట్లు భారత రక్షణ శాఖ గుర్తించింది.  కశ్మీర్లోకి చొరబడి దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరులు  పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని ఆర్మీ రంగంలోకి దించింది. ఇప్పటికే ఈ బృందం జమ్మూ లో 50 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నట్లు గుర్తించింది.
వీరికి అందుతున్న సహాయ సహకారాలపై దృష్టి సారించింది. నిర్మాణ పనులు చేసే కూలీల ద్వారా నెట్ వర్క్ పెంచుకున్న ఉగ్రవాదులు ఏఏ మార్గాల్లో ఆహారం, వసతి సౌకర్యాలు లభించనున్నాయనేది గుర్తించే పనిలో పడింది.  ఈ సమయంలో ఉగ్రవాదులు తమ ప్లాన్ మార్చుకున్నట్లు భారత నిఘా సంస్థ తెలిపింది. పాకిస్థాన్ లో శిక్షణ పొందిన తీవ్రవాదులను బంగ్లాదేశ్ పంపించి.. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ ద్వారా ఇండియాలోకి పంపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని బెంగాల్ బోర్డర్ వద్ద సుమారు 20 వేల మంది ఉన్నట్లు అంచనా. దీంతో ఆర్మీ అప్రమత్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: