చంద్రబాబు: ఆ ఒక్క ఐపీఎస్‌ కోసం శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నారా?

Chakravarthi Kalyan
ఏపీలో కీలక అధికారులన్నీ కూటమి నేతలు టార్గెట్ చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా.. అసలు ఎన్నికలకు సంబంధం లేని టీడీడీ ఈవోని కూడా తక్షణం బదిలీ చేయాలని రచ్చ చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖల ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు దిల్లీలోని బీజేపీ బ్యాచ్ ని ఇక్కడి నుంచి జనసేన, టీడీపీ నేతల్ని పంపించి నేరుగా ఫిర్యాదులు ఇప్పిస్తున్నారు.

ఆ అధికారుల్ని బదిలీ చేస్తేనే ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయి అంటూ కవరింగ్ గేమ్ మొదలు పెట్టారు.  వాస్తవానికి చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడింది ఇందుకే. తనకు అనుకూలంగా ఉండే  అధికారులను కీలక పదవుల్లో ఉంచి ఎన్నికల్లో లబ్ది పొందాలనేది చంద్రబాబు వ్యూహం. ఎప్పుడు అయితే పొత్తు ఖరారు అయిందో ఇక తెర వెనుక రాజకీయం మొదలు పెట్టారు. వాలంటీర్ల ద్వారా తనకు డ్యామేజ్ జరుగుతుందని భావించి చాలా వ్యూహాత్మకంగా తన చేతికి మట్టి అంటకుండా వారిని పక్కకి పెట్టించేశారు.

ఇప్పుడు ఇక అధికారుల వంతు. మొత్తం ఏపీలో ఎనిమిది మంది అధికారులను బదిలీ చేయాలంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వంలోని కూటమి నేతలు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ని కలిశారు.  సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇన్ ఛార్జి డీజీపీ కొల్లి రఘురామరెడ్డితో పాటు మరో నలుగురు అధికారులపై ఫిర్యాదు చేశారు.

తద్వారా తమకు అనుకూలంగా ఉండే ఏబీ వెంకటేశ్వరరావుని డీజీపీ చేయాలన్నది టీడీపీ వ్యూహం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించారని.. వైసీపీ ఆయన్ను పక్కన పెట్టింది. ఇప్పుడు టీడీపీ తమకు ఉన్న అధికారాలను అడ్డు పెట్టుకొని ఎలాగైనా అతనికి పోస్టింగ్ ఇప్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి తమకి అనుకూలంగా ఉండే అధికారులను ఎన్నికల్లో నియమించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: