కుమారి ఆంటీని ఆగం చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లు?

Chakravarthi Kalyan
సోషల్ మీడియా, యూట్యూబ్ పుణ్యమా అని కొందరు ఓవర్ నైట్ లో ఫేమస్ అవుతుంటారు. ప్రస్తుతం కుమారీ ఆంటీ కూడా ఇలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయింది. ముఖ్యంగా హైటెక్ సిటీలో ఎందరో టెకీ ఉద్యోగులు ఆమె దగ్గరకు వచ్చి తిని వెళ్తుంటారు.  ఇక్కడ తక్కువ ధరకే చికెన్, మటన్, వెజిటేరియన్ రకాలు అందిస్తుండటంతో ఎక్కడి నుంచో వచ్చి ఆమె దగ్గర భోజన ప్రియులు వాలిపోతున్నారు.

ఈ క్రమంలో యూట్యూబ్ ఛానెళ్లు, టీవీ ఛానళ్లు వెళ్లి కవరేజ్ ఇవ్వడంతో ఆమె దెబ్బకు ఫేమస్ అయిపోయింది. ఆమె స్టాల్ దగ్గర క్యూ కట్టి మరీ తినే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు వాహనాలను పెట్టడం వల్ల పార్కింగ్ సమస్య తలెత్తింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె స్టాల్ ను తీసేయాలని ఆదేశించారు. అదే విధంగా ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్  కావడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రత్యేకంగా కలుస్తానని చెప్పి స్టాల్ నడుపుకోవడానికి అనుమతి ఇచ్చారు.

ఇంత తతంగం జరగడానికి ముఖ్య కారణం మీడియా కవరేజీనే. ఆమె సోషల్ మీడియాలో ఫేమస్ కాకముందే చాలామంది వచ్చి భోజనం తినేవారు. కాకపోతే సోషల్ మీడియా దెబ్బకు ఆదాయం రెట్టిపయింది. సమస్యలు కూడా పెరిగిపోయారు. చివరకు కథ సుఖాంతం అయింది. అయితే కొంతమంది ఉత్సాహ వంతులు ఆమె పక్కన ఉన్న మిగతా షాపుల దగ్గరకి వెళ్లి ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు.

వాళ్లు ఏమో మా వ్యాపారాలు రోడ్డున పడ్డాయని.. తమ దగ్గర కూడా మంచి ఫుడ్ దొరుకుతుందని చెబుతున్నారు. ఆమె గురించి చెడుగా చెప్పడం ప్రారంభించారు. ఎదుటి వారి వ్యాపారం పై పక్కవాడికి ఎప్పుడూ అసూయ ఉంటుంది. ఇప్పుడు దానిని హైలెట్ చేస్తున్నారు.  ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న క్రమంలో ఇలాంటి పక్కదారి పట్టే వార్తలను ప్రసారం చేయకుండా ఆపాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: