ఇజ్రాయెల్‌పై అమెరికా వింత నిర్ణయం?

Chakravarthi Kalyan
తన ప్రయోజనాలకు పూచిక పుల్లంత విఘాతం కలిగినా అమెరికా తట్టుకోలేదు. పైగా జరిగిన దానిపై రంధ్రాన్వేషణ మొదలు పెడుతుంది. తాజాగా అమెరికా ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షలు విధించింది. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాతో పోటీ పడే ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షలు విధించడం ఒకింత విస్మయం కలిగించినా... అమెరికా హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకుంది.

దీనికి పాలస్తీనా వాసులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది కాబట్టి మధ్య ఆసియా దేశాల్లోఈ హింస యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని అగ్రరాజ్యం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. హమాస్ తీవ్రవాదులపై తాము, కలిసి చేసిన దాడులను సమర్థించిన అమెరికా ఇజ్రాయెల పాలస్తీనాపై చేస్తున్న దాడులను మాత్రం హింస కోణంలో చూడటం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇజ్రాయెల్ దేశ పౌరులపై అమెరికా అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కొద్ది రోజులుగా ప్రతి దాడులు చేస్తోంది. ముఖ్యంగా పాలస్తీనాలోని పలు నగరాలపై విరుచుకుపడుతోంది. సొరంగాల్లో దాక్కున్నతీవ్రవాదులను బందీలుగా పట్టుకొని తమ దేశానికి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో పాలస్తీనా దేశానికి మద్దతుగా హమాస్ తీవ్రవాదులు ఇతర ప్రాంతాల్లో ఉండి ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడుతున్నారు.

ఇదిలా ఉండగా.. హమాస్ కు మద్దతుగా అమెరికాలో సుమారు 50 రాష్ట్రాల్లో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ను విసిగిస్తున్నారు. అనేక చోట్ల ఆందోళనలు చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేస్తున్న దాడులను  ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బైడెన్ ఈ తరహా చర్యలకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు తీవ్రవాద సంస్థలకు మద్దతు పలుకుతున్న వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పించి  ఆ దేశ విలువను కోల్పోతుందని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: