ఇదీ గుట్టు: కడపలో కంటైనర్లలో డబ్బు కట్టలు..?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కడప నుంచి రూ. వేల కోట్లు  కంటైనర్ల ద్వారా తరలిస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. కంటైనర్లకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు ఉన్న ఫొటోలను అప్ లోడ్ చేసి తప్పుడు కథనాలు అల్లారు. ఆ వార్తలు క్షణాల్లో వైరల్ గా మారాయి.

అయితే ఇలాంటి వార్తల విషయంలో టీవీ ఛానెళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓ టీవీ ఛానెల్ లో శుక్రవారం కడప నుంచి 30 కంటైనర్లలో వైసీపీ నేతకి చెందిన డబ్బులు కడపలో పట్టివేత అంటూ స్ర్కోలింగ్ వేశారు . తీరా చూస్తే కడప నుంచి తిరుపతికి 30 ట్రక్కులు ఒకేసారి బయలుదేరాయి. పోలీసులకు అనుమానం వచ్చి ఆపి చూస్తే అందులో ఉన్నటువంటి వారు తిరగబడ్డారు. గన్లు చూపించారు  అని వార్తను  ప్రసారం చేశారు. ఇంతకీ వాళ్లెవరు అంటే కేంద్ర బలగాలు.

దేశ రక్షణకు సబంధించిన సామగ్రిని చెన్సైకి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కంటైనర్లకు ఎస్కార్ట్ గా వెళ్లారు. సామగ్రి వెళ్తున్న రూట్లలో ఎలాంటి అవంతరాలు లేకండా చూడాలని రక్షణ శాఖ, రాష్ట్ర పోలీస్ శాఖకు విజ్ఙప్తి చేసింది. అటు ఆర్మీ అధికారులు సైతం ఈ కంటైనర్లకు రక్షణగా ఉన్నారు.

ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొందరు ఈ ఎస్కార్ట్ వాహనాల గురించి అభూత కల్పనలు ప్రచారం చేశారు. ఆర్మీ వాళ్లు వెళ్తున్న కంటైనర్లను కావాలనే డబ్బులు తరలిస్తున్నారని ఓ దేశ ద్రోహి టీవీ ఛానల్ కి లీక్ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలా అంటే అందులో ఏ విధమైన ఆయుధ సామగ్రి ఉంది. ఏం తరలిస్తున్నారు అనే సమాచారం కోసం ప్రయత్నం చేస్తే వాళ్లు బెదిరించి ఉంటారు.  దీంతో టీవీ ఛానల్ ను ఉపయోగించుకొని అతనికి కావాల్సిన సమాచారం రాబట్టుకున్నాడు. ఓ దేశ ద్రోహి వేసిన ఎత్తులో మీడియా ఓ పావుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: