షర్మిళకు షాక్‌ ఇచ్చిన టీడీపీ నేత?

Chakravarthi Kalyan
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఆ సయమంలో  ఏ రోజు కూడా పొరపాటున తనకు ఏపీలో లేదా అన్నకి తనకి సాక్షి లో సగభాగం వాటా ఉందని చెప్పలేదు. కానీ ఏపీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాకు ఆ పత్రికలో వాటా ఉందని.. అలాంటి పత్రికలో నన్ను తిట్టిపోస్తున్నారని.. తనపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే వాస్తవానికి సాక్షి కుటుంబ ఆస్తి కాదు. పెట్టుబడులు పెట్టారు. ప్రారంభంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు మీద రిజిష్ట్రేషన్ అయింది. ఆ తర్వాత అది ఆయన సతీమణి భారతి పేరుమీదకి మార్చారు. అందులో ఆమెకు వాటాలు ఉంటే.. లేదా పెట్టుబడులు పెడితే జగన్ తో పాటు షర్మిళను కూడా జైలులో పెట్టాలి కదా.  జగన్ ఎప్పటి నుంచో నాకు పేపర్ లేదు. న్యూస్ ఛానల్ లేదు అని చెబుతుంటారు. దాని వెనుక ఉద్దేశం ఆయన పేరు మీద లేవని కావొచ్చు.

అలాగే చంద్రబాబు కూడా నా పేరున ఎటువంటి ఆస్తి లేదు. కావాలంటే నా ప్రాపర్టీ లిస్ట్ చూడండి అంటూ చెబుతుంటారు. వాస్తవానికి ఆయన ఆస్తులు తన మనువడి పేరునో.. కుమారుడి పేరునో.. లేక భార్యపేరునో ఉంటాయి. దానిని మనం నమ్మినప్పుడు జగన్ కు పత్రిక లేదు అన్నప్పుడు కూడా నమ్మాలి.

కానీ అకస్మాత్తుగా టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సాక్షి ఎవరిది.. నీదు కాదు. నీ భార్య భారతి కి సంబంధం లేదు. నీ కూతుర్లకు వాటా లేదా. నీ బావ మరిది దినేశ్ రెడ్డికి చెందింది కాదు.. ఇంతకీ సాక్షి ఎవరిది అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే టీడీపీ నేతలు షర్మిళకు వాటా లేదని చెబుతున్నారా.. ఒకవేళ వాటా ఉండుంటే ఆమె పేరు కూడా చెప్పాలి కదా. ఇది వాస్తవం అయితే టీడీపీ వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: