ఆ ఫ్లాట్లు మాకొద్దంటున్న అమరావతి రైతులు?

Chakravarthi Kalyan
రాజకీయ చట్రంలో అమరావతి నలిగిపోతోంది అనేది వాస్తవం. అభివృద్ధి ముసుగులో అక్కడి రైతుల్ని తప్పుదోవ పట్టించి వాళ్ల  భూములు గుంజేసుకున్నారు.  ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది.. మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అని అభూత కల్పనలతో అక్కడి రైతుల్ని మోసం చేశారు. దీంతో కొంతమంది రైతులు తమ సొంత పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు.  

దానికి బదులుగా వేరొచోట అన్ని మౌలిక వసతులు కల్పించి ప్లాట్లను ఇస్తామని నమ్మబలికారు. తీరా చూస్తే ఐదేళ్లలో ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వారికి వసతులు కల్పించి ప్లాట్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ ఏదో వంక పెట్టి వాటిని ఇవ్వనీయకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. అసైన్డ్ భూముల దగ్గర కొన్నవారికి కూడా ప్లాట్లు వచ్చాయి. కానీ అసైన్డ్ భూములు వారికి మాత్రం ప్లాట్లు ఇవ్వలేదు.

భూమిని తీసుకొని.. ఇస్తానన్న భూమిని టీడీపీ హయాంలో ఇవ్వకుండా పైగా వైసీసీ ప్రభుత్వం ఇస్తున్నా ఇవ్వనీయకుండా కొంతమంది అడ్డు పడుతున్నారు.  కోర్టుల్లో వందల కొద్దీ కేసులు వేస్తున్నారు. తాజాగా రైతులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ప్లాట్ల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. సోమవారం సాయంత్రం జరగాల్సిన లాటరీ కార్యక్రమానికి తగినంత మంది రాలేదు. దీంతో సీఆర్డీఏ అధికారులు వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

మార్చిన ప్లాట్ల కేటాయింపు నిబంధనలు తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని లాటరీ కార్యక్రమాన్ని రాజధాని రైతుల బహిష్కరించారు. 27న జరిగిన ఐదు గ్రామాల పరిధిలోని ప్లాట్లకు లాటరీ తీసే కార్యక్రమానికి రైతులు రాకపోవడంతో వాయిదా పడింది. సోమవారం కురగల్లు 1, 2 యూనిట్ల పరిధిలోని 44మంది రైతులకు సంబంధించి లాటరీ తీసేందుకు ఏర్పాట్లు చేశారు. నిబంధనల ప్రకారం మూడో వంతు హాజరు తప్పనిసరి. ముగ్గురే రావడంతో.. కోరం లేక వాయిదా వేస్తున్నట్లు సీఆర్డీఏ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ చిరంజీవి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: