చరిత్రలో మొదటిసారి.. టీడీపీ పూర్తిగా గల్లంతు?

Chakravarthi Kalyan
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 56 స్థానాల ఎన్నికకు ఫిబ్రవరి 8న ప్రకటన విడుదల కానుంది. ఇక ఏపీ నుంచి మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఈ లిస్టులో ఉన్నారు. టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కనకమేడల రవీంద్రకుమార్ పదవీ కాలం ఏప్రిల్ 4తో ముగియనుంది.

అయితే ఈ స్థానం తిరిగి గెలుచుకోవడం టీడీపీ కష్టమే. ఈ నేపథ్యంలో 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ ఖాళీ అవుతుందనే టాక్ పొలిటకల్ సర్కిల్ లో వినిపిస్తోంది.  తెలుగు దేశం పార్టీని నందమూరి తారకరామారావు 1983లో స్థాపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక అప్పటి కేంద్రంలో టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. అలానే 41 ఏళ్లుగా రాజ్యసభలో టీడీపీ తన ఉనికి కొనసాగిస్తూ వస్తోంది.

2019 ఎన్నిక్లలో టీడీపీ ఘోర పరాభవం చవిచూసింది. ఈ క్రమంలో ప్రస్తుత వైసీపీ నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి ఒక్కరు, టీడీపీ నుంచి ఒక్కరే రాజ్యసభలో ఉన్నారు. తాజాగా ఏప్రిల్ 4తో పదవీకాలం ముగియనందున తమ స్థానం నిలబెట్టుకోవాలని టీడీపీ ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టీడీపీ ఆ స్థానం గెలుచుకునే అవకాశం లేదు.

ప్రస్తుతం ఏపీలో 175 స్థానాలు ఉన్నాయి.  ఒక ఎంపీ స్థానం గెలుచుకోవాలంటే 44మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురు పార్టీ ఫిరాయించగా.. గంటా శ్రీనివాసరావుపై అనర్హత వేటు పడింది. దీంతో టీడీపీ బలం 18కి పడిపోయింది. దీంతో అదనంగా మరో 26మంది ఎమ్మెల్యేల మద్దతు టీడీపీకి అవసరం. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాగా ఇప్పుడు కూడా అద్భుతం జరుగుతుంది అని టీడీపీ నేతలు అంటున్నారు. ఒకవేళ అలా జరగని పక్షంలో 41ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు అవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: