ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వైఎస్‌ షర్మిల?

Chakravarthi Kalyan
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం  సీఎం జగన్ వర్సెస్ షర్మిళ అనే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు షర్మిళ తెలంగాణ రాజకీయాల్లో ఉండిపోవడంతో ఏపీలో ఆమె గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలకు తెరదించి.. ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఏపీలో లోకి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పుడు సంచలన కామెంట్లతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు.

అయితే షర్మిళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నారా.. ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్ గా బాగానే రాణిస్తున్నారు. అయితే ఆమెకు సంబంధించిన విషయాలన్నీ ఏబీఎన్ ముందుగానే పసిగట్టి రాస్తుంది. ఆమెచెప్తే రాస్తున్నారా.. లేక ఊహించి రాస్తున్నారా అనేది పక్కన పెడితే.. షర్మిళ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అందరికంటే ముందు చెప్పిందే ఏబీఎన్. అయితే తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ విలీన ప్రక్రియ నిలిచిపోయింది.

షర్మిళను కాంగ్రెస్ లో చేర్చుకొని ఏపీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ ఆమె బాధ్యతలు స్వీకరించినట్లయితే ఆమెకు భరోసాగా కర్ణాటక నుంచి రాజ్య సభకు పంపిస్తారు అని ఏబీఎన్ ఆర్కే విశ్లేషించారు. ప్రస్తుతం రాజ్యసభకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల ముందే పెద్దల సభలో ఖాళీల భర్తీకి కేంద్రం సమాయత్తం అవుతుంది. 15 రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 56 మంది సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2,3 తేదీల్లో ముగుస్తుంది.

ఆయా స్థానాల భర్తీకి ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 27న పోలింగ్ ఉంటుంది. ఆ రోజు సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో రెండు కాంగ్రెస్, ఒకటి భారాస గెలుచుకునే అవకాశం ఉంది. అదే సందర్భంలో కర్ణాటకలో మోజార్టీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. వీళ్లు రాసిన దాని ప్రకారం షర్మిళ కు రాజ్యసభ ఇస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఒకవేళ ఇస్తే ఆరేళ్ల  పాటు ఆమెకు తిరుగు ఉండదు. ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: