బాబోయ్‌.. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టేనా?

Chakravarthi Kalyan
గత కొంత కాలంగా మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన చర్చ బలంగా సాగుతోంది. ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి ఈ చర్చ సాగుతూనే ఉండగా.. తాజాగా హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం జరిగిన తర్వాత దీని తీవ్రత మరింత పెరిగింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా తరచూ క్షిపణి ప్రయోగాలు చేయడం వీళ్లకూ రష్యాకు మంచి అవినాభావ సంబంధాలు ఉండటంతో ఈ చర్చ ఇంకాస్త బలంగా జరగుతుంది.

ఈ సమయంలో మూడో ప్రపంచ యుద్ధంపై కొన్ని లీకులు బయటకి వస్తున్నాయి. ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా, యూరప్ దేశాలు.. రష్యాకు చైనా, ఉత్తర కొరియా దేశాలు బయట నుంచి మద్దతు ఇస్తున్నాయి. కాకపోతే చైనా, ఇరాన్ లు నేరుగా యుద్ధంలో పాల్గొనడం లేదు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ కు అనుకూలంగా అమెరికా, యూరప్ దేవాలు, హమాస్ కు మద్దతుగా ఇరాన్ లు నేరుగా యుద్ధంలోకి దిగడం లేదు.

అయితే ఈ పరిణామాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో ఎవరూ ఊహించలేం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు చాలా చిన్న చిన్న కారణాలతో మొదలై ప్రపంచం మొత్తం వ్యాపించాయి. ఇదంతా ఎందుకు అంటే.. ఉక్రెయిన్ ఓటమి దశకు చేరుకుంది. రష్యా విజయానికి దగ్గరలో ఉంది. రేపు మాపో రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నా ఆశ్చరప్యపోవాల్సిన పనిలేదు.

అయితే ఉక్రెయిన్ తమను తాము రక్షించుకునే దశలో ఉంది తప్ప గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ  దశలో నాటో దేశాలు భయపడుతున్నాయి. ఈ క్రమంలో జర్మనీ లాంటి దేశాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసి ఆ విధంగా సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పుడు తాజాగా బ్రిటన్ కూడా యుద్ధ సన్నాహాలు అవసరం. రష్యాతో ప్రమాదం పొంచి ఉంది అని పేర్కొంటుంది. ఈ క్రమంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: