టీడీపీలో లుకలుకలు.. వైసీపీ పండుగ చేసుకుంటోందా?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల ప్రకటనలకు ముందే ప్రచార పర్వం దాదాపు ప్రారంభమైంది. ఇప్పటికే టీడీపీ అధినేత రా కదిలిరా అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎంపిక చేసిన నియోజకవర్గంలో సభలు పెడుతూ అభ్యర్థలు ఎంపిక పై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల వరకు ఎన్నికల బహిరంగ సభలను వైసీపీ నిర్వహించలేదు. కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సభల్లో జగన్ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇప్పుడు వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ సిద్ధం పేరుతో సభను నిర్వహించింది. ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అయితే వైసీపీ బలహీనతలు తెలుసుకోవాలంటే ఎల్లో మీడియా పేపర్ ను, టీడీపీ జనసేన పార్టీ లుకలుకలు తెలియాలంటే బ్లూ మీడియా ను చూస్తే సరిపోతుంది. తాజాగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా టీడీపీ వర్గపోరుతో సతమతం అవుతుందని బ్లూ మీడియా రాసుకొచ్చింది.  దీనిని ఓ సారి గమనిస్తే..

ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వ కారణం అన్నట్లు ప్రతి చోట తమ్ముళ్ల తగవులాట కనిపిస్తోంది. జిల్లా కేడర్ ఎవరికి వారే యమునా తేరే అన్నట్లు వ్యవహరిస్తోంది. కారంచేడులో సొంత పార్టీ ఫ్లెక్సీలను కార్యకర్తలు చింపేయడం, ఎమ్మెల్యేలపై దూషణల పర్వానికి దిగడం అధిష్ఠానానికి మింగుడు పడటం లేదు. చీరాలలో కొండయ్య నాయకత్వాన్ని బహిరంగంగానే కొందరు వ్యతిరేకించడం.. వేమూరులో ఓ వర్గానికి నక్కా కొమ్ము కాయడం.. బాపట్ల ఇన్ఛార్జి రోజుకో నాయకుడిని వెనకేసుకు రావడం అక్కడి కార్యకర్తలకు రుచించడం లేదు.

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీరుపై కేడర్ విసుగెత్తిపోతోంది. ఇటీవల కారంచేడులో మండల టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో పాటు పోపూరి శ్రీనివాసరావు, ఇంకొల్లులో పార్టీ సీనియర్ నేత కొల్లూరు నాయుడమ్మ ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. చీరాల టీడీపీ ఇన్ఛార్జి కొండయ్యను ఆపార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. అలాగే బాపట్ల ఇన్ఛార్జి వేగేశనరేంద్రవర్మ వైఖరి నచ్చక అన్నం సతీశ్ ప్రభాకర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా అసంతృప్త నేతలు, టికెట్ ఆశావహుల గురించి రాసి టీడీపీ క్యాడర్ ను గందరగోళంలో పడేసే ప్లాన్ లో వైసీపీ నిమగ్నమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: