షర్మిల వల్ల ఆత్మహత్య! ఎంతపని జరిగింది?

Chakravarthi Kalyan
కొన్ని ఊహించని పరిణామాలు, మరొకొన్ని ఊహించిన పరిణామాల నడుమ తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు షాకిస్తూ వైఎస్ షర్మిళ వైసార్టీపీనీ కాంగ్రెస్ లో విలీనం చేశారు.  అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు అన్నట్లు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వేలకొద్దీ కిలోమీటర్ల పాదయాత్ర చేసి తీరా ఎన్నికల సమయానికి అస్త్ర సన్యాసం చేశారు.  తన ఆట కాంగ్రెస్ పార్టీ ఆడుతుందని బ్యాట్ పక్కన పడేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తాను ఆడకపోవడం వల్లే విజయం సాధించిందని చెప్పుకున్నారు. కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సోనియమ్మను ఆకాశానికెత్తారు. రాహుల్ ని ప్రధాని చేయడమే తన లక్ష్యమన్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఏనాడు ఇబ్బంది పెట్టలేదని చెబుతున్నారు.  వైఎస్ బిడ్డగా చెబుతున్న వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ చాలా చేసిందని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ లో వైఎస్సార్ పేరు చేర్చడం సోనియాకు తెలియకుండా జరిగిన పొరపాటని వ్యాఖ్యానించారు.

ఈ సమయంలో తెలంగాణలో రాజన్య రాజ్యం బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించారో ఏమో ఏపీలో వైఎస్సార్ ఆశయ సాధన తన బాధ్యత అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించారు. ఈ సమయంలో వచ్చీ రాగానే జగన్ పై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆమె వ్యవహారాల్లో కొన్నింటిని వైసీపీ నాయకులు బయట పెడుతున్నారు. జగన్ జైలులో ఉన్న సందర్భంలో ఆయన సతీమణి భారతి పాదయాత్ర చేస్తానంటే వద్దని వారించి షర్మిళనే పాదయాత్ర చేస్తానని చెప్పినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

తాజాగా మరో పోస్టు వెలుగులోకి వచ్చింది. కార్యకర్తలకు కాదు కనీసం ఆమె నియమించిన నియోజకవర్గ ఇన్ఛార్జిలకు కూడా చెప్పకుండా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది.  పాదయాత్ర సమయంలో  ఫ్రాన్సిస్ అనే వ్యక్తికి మల్కాజిగిరి అభ్యర్థిగా షర్మిళ ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు మద్దతిస్తే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో కుటుంబాన్ని ఆదుకుంటానని.. అతని పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తానని షర్మిళ మాట తప్పిందని అతను పోస్టులో రాసుకొచ్చారు. దీనిని ఇప్పుడు వైసీపీ నాయకులు వైరల్ చేస్తున్నారు. దీనిపై ఆమె ఏం స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: