ఆంధ్రా ఎన్నికలపై కొత్త సర్వే.. షాకింగ్‌ రిజల్ట్స్‌?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల మూడ్ నెలకొంది. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తో పాటు ఏపీ అసెంబ్లీ కూడా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 16న ఏపీలో ఎన్నికల పోలింగ్ ఉంటుందని ప్రచారం జరగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఏపీ పరిస్థితులపై ఆత్మసాక్షి సర్వే తన ఫలితాలను వెల్లడించింది.

అందులో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్నిస్థానాలు వస్తాయో ఆత్మసాక్షి పేర్కొంది. కానీ ఇవి పార్లమెంట్ స్థానాల వరకే ఫలితాలు వెల్లడించడం విశేషం. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి.  ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 10 స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. అటు టీడీపీ, జనసేన కూటమి 9 ఎంపీ సీట్లను గెలుచుకుంటుదని తేల్చి చెప్పింది. మరో ఆరు స్థానాల్లో హోరాహోరీ పోటీ నడుస్తుందని స్పష్టం చేసింది.

ఈ సర్వే ప్రకారం ఏపీలో గట్టి ఫైట్ ఉంటుందని తేలింది. వైసీపీకి సంబంధించి విజయనగరం, అరకు, అమాలపురం, ఏలూరు, కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, నంద్యాల పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే స్థానాలు పరిశీలిస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, నరసారావుపేట, బాపట్ల, నరసాపురం, కాకినాడ, కర్నూలు, హిందూపురం ఉన్నాయి. రాజమండ్రి, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో గట్టి పోటీ నడుస్తుందని సర్వే తేల్చింది.

ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆసక్తికర సర్వేగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన వైసీపీకి 70 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 63 సీట్లు రావొచ్చని సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇక ఆరు పార్లమెంట్ స్థానాలు పరిధిలోని 42 స్థానాల్లో పోటీ హోరాహోరీగా నడవనుంది. ఇందులో మోజార్టీ స్థానాలు ఎవరు దక్కించుకుంటే వారి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: