బాబు ఫీజులు ఎగిరిపోయాయ్‌.. స్పీకర్ బిగ్‌ షాక్‌?

Chakravarthi Kalyan
రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు పంపారు. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ ఉంటుందని తప్పకుండా హాజరు కావాలని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ నోటీసులు పంపారు. ఆ రోజు మధ్యాహ్నం 12గంటలకు విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ నోటీసులు పంపారు.

అయితే.. స్పీకర్‌ నిర్ణయాన్ని ముందుగానే ఊహించిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని ఇప్పటికే స్పీకరుకు లేఖ రాశారు. అయితే.. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వారి గడువు విజ్ఞప్తి ని తిరస్కరించారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే స్పీకర్ కు వైసీపీ ఎమ్మెల్యేలు లేఖ రాసినా.. దాన్ని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ పట్టించుకోలేదు.

అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తన నోటీసుతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగులు అసలైనవో.. మార్ఫ్ చేసినవో నిర్ధారించుకోవాల్సి ఉందంటున్న ఎమ్మెల్యేలు.. తమకు 30 రోజులు గడువు కావాలని లేఖ రాసారు. అయితే.. 30రోజుల సమయం ఇవ్వడం కుదరదని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేశారు. నోటీసులతో పాటు పేపర్, వీడియో క్లిప్పింగులు రెబల్ ఎమ్మెల్యేల వాట్సాప్ కు పంపామని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది.

అంటే.. అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైసీపీ  రెబెల్ ఎమ్మెల్యేల వినతిని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తిరస్కరించినట్టే. ఈ స్పీకర్ నిర్ణయంతో.. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: