అమెరికాకే బిగ్‌ షాక్‌ ఇచ్చిన అజిత్ ధోవల్?

Chakravarthi Kalyan
దేశంలో జరగబోయిన పెద్ద కుట్ర భగ్నం అయింది. అదే సమయంలో అమెరికా కుట్రకు అజిత్ ధోవల్ చెక్ పెట్టారు. రానున్న రోజుల్లో ఎత్తులు పై ఎత్తులు నడవబోతున్నాయి. ఈ నెల 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకు గత మూడు నెలల నుంచి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం వాటిని ముందుగానే పసిగట్టి నిరోధించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులతో పాటు యాంటీ టెర్రిస్ట్ స్వ్యాడ్ సఫలం అయ్యారు.

శుక్రవారం ముగ్గురు ముష్కరులను  యాంటీ టెర్రిస్ట్ స్వ్యాడ్ బృందం పట్టుకుంది. వీరిలో శంకర్ లాల్ కు కెనడాలోని గ్యాంగులతో పరిచయాలు ఉన్నాయి. దీంతో ఖలీస్తాన్ టెర్రర్ గ్రూపు కంట్లో పడ్డారు. ఈ క్రమంలో అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏదైనా అల్లర్లు సృష్టించాలని ఖలీస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తలచి ఆ పనిని శంకర్ లాల్ కు అప్పగించారు.

అయోధ్య నగరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని.. ఒకవేళ దొరికితే మా పేర్లు చెప్పకూడదు అని ఒప్పందం కుదుర్చుకున్నారు.  అయితే  RAW నుంచి వచ్చిన ఇన్ పుట్ ఆధారంగా అప్రమత్తమైన పోలీసులు ఆంజనేయ స్వామి స్టిక్కర్ అంటించి రెక్కీ నిర్వహిస్తున్న వీరిని గుర్తించి అరెస్టు చేశారు. ఇది పెద్ద వార్త కాకపోయినా నిందితులు ముగ్గురూ హర్మీందర్, గురుపత్వంత్ పన్నూ పేర్లను న్యాయమూర్తి ఎదుట చెబితే అది అమెరికన్ ఫెబీఐ, సీఐఏలకు చుక్కలు కనపడతాయి. ఇది పెద్ద వార్త అవుతుంది.

గత డిసెంబరులో గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య  చేయడానికి నిఖిల్ గుప్తాకు నిధులు సమకూర్చింది raw అంటూ జో బైడెన్ ఆరోపించారు. దీనికి కెనడా ప్రధాని ట్రూడో వంత పాడారు.  ఇది పరోక్షంగా భారత్ ను లక్ష్యంగా చేసిన ఆరోపణ. దీనిపై నిజనిర్ధారణ కోసం విచారించవచ్చని మోదీ బైడెన్ ను కోరగా ఆయన ఎఫ్ బీఐ డెరెక్టర్ ను భారత్ కు పంపారు. ఈ క్రమంలో నిందితులు అరెస్టు కావడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: