తెలంగాణ ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటున్నారా?

frame తెలంగాణ ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటున్నారా?

Chakravarthi Kalyan
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. విమర్శలు ప్రతి విమర్శలతో నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఆరు గ్యారెంటీలు, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ దూకుడు కొనసాగించింది. బీసీ సీఎం, సకల జనుల మ్యానిఫెస్టోపై బీజేపీ ఫోకస్ చేసింది. అయితే ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారో డిసెంబరు 3న తేలనుంది.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా అనే అంశం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.  సహజంగా అధికార పార్టీ పై వ్యతిరేకత ఉంటుంది. అయితే కొన్ని వర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగింది కదా.. కొత్తగా చేయాల్సింది ఇంకేం ఉంది. ప్రయోగం ఎందుకు చేయాలి అనే భావన బలంగా ఉంది.

అందుకే బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వమే వస్తుందనే ధీమాతో ఉన్నారు. మరోవైపు యువత ప్రభుత్వ పాలనపై గుర్రుగా ఉన్న మాట వాస్తవమే అయినా కొన్ని వర్గాలు మాత్రం పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయి. స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోని ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. పలు సర్వేలు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెబుతున్నా  ఈ వర్గం ఓటర్లంతా నిజమా అని ఆ సమయానికి కేసీఆర్ ఏదో ఒకటి చేస్తారు అనే ఆలోచనలోనే ఉన్నారు. ఈ ఓటు బ్యాంకునే బీఆర్ఎస్ నమ్ముకుంది.

అదే సమయంలో ప్రభుత్వం అభివృద్ధి చేసిందా లేదా.. పథకాలు ప్రవేశపెట్టిందా.. ఎప్పుడూ వీళ్లే అధికారంలో ఎందుకు. ఎవరు గెలిచినా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు కాబట్టి మార్చి చూద్దాం అని కొందరు భావిస్తున్నారు.  అదే సందర్భంలో స్థానిక నాయకులపై అసంతృప్తి కూడా బీఆర్ఎస్ కు బలహీనంగా మారాయి. సీఎం అందర్నీ కలవడం లేదు. ఓసారి ఓడించాలి అని కొంతమంది భావిస్తున్నారు.  కాబట్టి ఈ రెండు అంశాల్లో ఏది ఎక్కువగా ప్రభావం చూపితే ఆ పార్టీనే గెలుస్తుంది. మార్పు కావాలా.. లేక దీనిని కొనసాగించాలా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: