ప్రపంచాన్ని భయపెడుతున్న ఇరాన్ అణు కార్యక్రమం?

Chakravarthi Kalyan
హమాస్ ఉగ్రదాడిపై ఇజ్రాయెల్ రగిలిపోతుంది. పటిష్ఠమైన నిఘా వ్యవస్థ, మొసాద్ వంటి అగ్రశ్రేణి గూఢాచార వ్యవస్థ ఉన్నప్పటికీ దాడుల్నీ ఆపలేకపోయింది. అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు కేవలం 20 నిమిషాల్లోనే గాజా నుంచి 5వేల రాకెట్లతో ఇజ్రాయెల్ పైకి ప్రయోగించారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దుల వద్ద నిఘా వ్యవస్థను కళ్లుగప్పి ఇజ్రాయెల్ పౌరుల్ని హతమార్చారు. ఇందులో దాదాపు 1200మంది చనిపోగా 240మందిని హమాస్ బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు.

 
ఈ నేపథ్యంలో ఇరాన్ ఏమైనా పెద్ద వ్యూహం పన్నిందా అనే అనుమానాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఎందుకుంటే హమాస్ చేత ఇజ్రాయెల్ పై దాడి చేయించింది ఇరానే అని ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే మత పరమైన అవసరాల కోసం అక్కడ ఉన్న యూదుల్నీ అంతం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలని చూడటం ఒక అంచనా అయితే.


ఇక రెండో విషయానికొస్తే ప్రపంచ దృష్టిని మరల్చేందుకా అనేది తాజా సందేహం. హిజ్బుల్లా  కానీ, హౌతీ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులను పెంచి పోషించేది ఇరాన్ దేశం. ఇప్పుడు ఈ మూడు ఉగ్రమూకలు ఇజ్రాయెల్ పై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. అయితే తాము అణ్వస్త్రాలను తయారు చేయబోమని ప్రపంచ దేశాలకు లిఖిత పూర్వకంగా రాసిచ్చింది ఇరాన్. ఈ సమయంలో ప్రపంచ దృష్టిని మరల్చి అణ్వస్త్ర తయారీని చేపడుతుందా అనే సందేహాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి.


వీటికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ తలచుకుంటే రెండు వారాల్లోగా అణ్వస్త్రాలను తయారు చేసుకునే విధంగా ముడి సరుకులను సమకూర్చుకుంటుందని అమెరికా పత్రిక వెల్లడించింది. ఇరాన్ ఎప్పటి నుంచో అణు శక్తిగా మారడానికి యత్నిస్తోంది. 2015లో కుదిరిన ఒప్పందం మేరకు ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదు. 2018లో అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటకు రావడంతో ఇది పనికి రాకుండా పోయింది. అణ్వస్త్ర దేశాల వ్యవహారంలో ఇరాన్ అంశం చర్చకు వచ్చిన సమయంలో ముందు ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడిని ఖండించండి అని చెప్పి ఇరాన్ కవర్ చేసే ప్రయత్నం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: