నగ్న స్వామీజీకి మోదీ పూజ.. మధ్యలో టీడీపీ?

Chakravarthi Kalyan
సాధారణంగా స్వామీజీలు గురించి మన అందరికీ తెలిసిందే. తలపాగా చుట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి జపం చేస్తూ ఉంటారు. వీరిలో రకరకాల స్వాములు కూడా ఉంటారు.  అయితే  జైన స్వాముల్లో కొంతమంది నగ్న స్వాములు ఉంటారు. ఇలా స్వాములు అయిన వారిలో కోటీశ్వరులు కూడా ఉంటారు.  వారు సర్వం త్యజించి.. పుట్టినప్పుడు బట్ట లేదు.. పోయిన అప్పుడు బట్ట లేదు అనే ఉద్దేశంతో ఏమీ ధరించకుండానే తిరుగుతుంటారు. వీరిది ఒక ప్రత్యేక విధానం.


తాజాగా ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ దిగంబర్ సంత్ దర్శనం చేసుకున్నారు. రాజ్నందగాన్ జిల్లాలోని జైన్ కమ్యూని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన డోనాగర్ ఘర్ ను సందర్శించారు. అక్కడ దిగంబర జైన గురువు ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ మహరాజ్ ని కలిశారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్ లో పోస్టు చేశారు. అందులో మోదీ జైన సాధువు పాదాలను నమస్కరించినట్లు, ఆయన ఆశీర్వదించినట్లు ఉన్న ఫొటోలు ఉన్నాయి.


ఇలా పెట్టిన ఫొటోలకు ఓ టీడీపీ అభిమాని దేశ ప్రజలకు మీ స్థాయికి వచ్చేలా దీవించండి అని స్వామీజీని మోదీ కోరినట్లు తన అకౌంట్ లో రాసుకొచ్చారు. దీనిబట్టే అర్థం అవుతుంది. వారు మోదీ పట్ల ఎంత మూర్ఖంగా ఉన్నారో. మోదీ పాలనలో మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో అయిదో స్థానానికి ఎగబాకింది.


ప్రపంచ జీడీపీ ఒక ఎత్తు అయితే మన దేశ జీడీపీ 6.3 గా నమోదైంది. సుమారు 80 కోట్ల మందికి బియ్యం ఉచితంగా అందిస్తున్నారు.  అంటే మన దేశం వృద్ధి చెందినట్లా లేక దిగజారినట్టా. టీడీపీ శ్రేణులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానిక చంద్రబాబుకి పొగరు ఉండదు. సంయమనం పాటిస్తారు. కానీ ఆయన కింద ఉండే కొంతమంది నాయకులు వల్ల ఆయనకు చెడ్డపేరు వస్తోంది. అదే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమైందన్న వాదన ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: