అమెరికాలో.. ఇజ్రాయెల్-గాజా యుద్ధం?
పాలస్తీనా, ఇజ్రాయెల్ కు సంబంధించిన శరణార్థులు జీవనోపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం పాలస్తీనా, ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆయా దేశ శరణార్థులు వారికి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తూ మత ఘర్షణలకు తెగబడుతున్నారు. మన దేశంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కి సంబంధించిన పౌరులు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తుంటారు. వాళ్లు కచ్చితంగా మన దేశ చట్టాలను గౌరవించాలి. వాటినే పాటించాలి. ఇలానే వేరే దేశాల్లో జీవనం సాగిస్తున్న వారు ఆయా దేశ చట్టాలను పాటించాలి.
కానీ అమెరికాలో అలాంటి పరిస్థితి లేదు. సిక్కు ఉద్యమకారులు భారతీయ హిందువులపై, రాయబార కార్యాలయాలపై, ఇతర వారిపై దాడులు చేస్తున్నారు. వీరికి అమెరికా ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కులు, స్వాతంత్ర్యపు హక్కులు, భావ ప్రకటన హక్కు పేరిట వారిని సమర్థిస్తున్నారు.
ఇదే ఆ దేశానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. హమాస్ చర్యలను సమర్థిస్తూ పాలస్తీనా శరణార్థులు అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ఖండిస్తూ ఇజ్రాయెల్ మద్దతుదారులు ర్యాలీలు తీస్తున్నారు. ఈ సందర్భంలో ఈ రెండు వర్గాలు ఎదురుపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మరోవైపు పాలస్తీనా కు మద్దతు ఇవ్వకపోతే మా సపోర్టు ఉండదని ముస్లిం నాయకులు బైడెన్ ను హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు పెరిగితే ఇద్దరినీ ఆ దేశం నుంచి బయటకు పంపేస్తారు.