ముస్లిం యువత.. ఈ విషయం ఆలోచించాలి?

Chakravarthi Kalyan
దేశంలో శారీరక శ్రమ చేయడంలో సమర్థమంతమైన పాత్ర పోషిస్తున్న వారు ముస్లింలు అని చెప్పొచ్చు. చిన్న టైర్ పంక్ఛర్ ల నుంచి డ్రైవింగ్, హర్డ్ వర్క్ పనులు ప్రస్తుతం ముస్లిం యువత చేస్తోంది. బేషజాలకు పోకుండా ఎక్కడా ఏ పని దొరికిన చేసేందుకు ప్రస్తుతం ముస్లిం యువత ముందుకు వస్తుంది. కుటుంబంలో ఎక్కువ మంది ఉండటం కచ్చితంగా పని చేయాల్సి రావడం, ఇలా అనేక రకాలుగా వివిధ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

ఇదే సమయంలో హిందువుల్లో ఉండే యువత ప్రస్తుతం శారీరక శ్రమ చేసే పనులు కాకుండా సాప్ట్ వేర్, ఇతర కూర్చుని చేసే పనులకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రతి షాపులో హిందు యువత పని చేసే వారు. కానీ ప్రస్తుతం ఆ విధానాన్ని విస్మరించి పెద్ద ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఎక్కువగా బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, తదితర రాష్ట్రాల్లో ముస్లిం యువత క్రిమినల్ కేసుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటు వంటి రాజకీయ పార్టీలు అసాంఘిక కార్యక్రమాలకు ముస్లిం యువతను బలిచేస్తున్నారని ముస్లిం మత పెద్దలు ఆరోపిస్తున్నారు.

స్వార్థ రాజకీయ భావజాలాల్లో ఇరుక్కుని ముస్లిం యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలిండియా యూనైటెడ్ డెమొక్కటిక్ ప్రంట్ అధ్యక్షుడు, ఎంపీ బాబరుద్దీన్ ముస్లిం యువతకు కొన్ని విషయాలపై సూచనలు చేశారు. ముస్లిం యువత చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాలని కోరుతున్నాడు.

స్వార్థ రాజకీయ ఉచ్చులో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కొన్ని మతాల్లోని వారు బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. కానీ ముస్లిం యువత స్వార్థ రాజకీయాల ఉచ్చులో చిక్కుకుని కటకటాలపాలవుతున్నారని పేర్కొన్నారు. జైళ్లకు వెళ్లడం కాదని బాగా చదువుకుని తాను బాగుపడుతూ కుటుంబాన్ని బాగా చూసుకునే ఉద్యోగం సంపాదించేలా ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: