సుడిగాలిలా చెలరేగిపోతున్న కేసీఆర్?
మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. దాంతో మళ్లీ రైతులకు అరిగోస తప్పదంటూ ప్రతి సభలో కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. 24 ఏళ్ల కిందట నేనొక్కడిని ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం నా వెనకాల ఉందని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇంకా కాంగ్రెస్, బీజేపీల టికెట్ల పంపకం పూర్తి కాకముందే సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేేసేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉంది. ఆ సమయంలో ఎలాంటి పనులు చేసింది. ఎంత మంది ఉద్యమకారులను పొట్టనపెట్టుకుంది లాంటి విమర్శలు ఇంకా చేయడం లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ లాంటి పార్టీ అధికారంలోకి వస్తే జరగబోయే పరిణామలు ఎలా ఉంటాయో ప్రజలకు కళ్లకు కట్టేలా వివరిస్తున్నారు. ఎట్ల ఉంటే తెలంగాణను ఎట్ల మార్చుకున్నాం అని చెబుతున్నారు.
దేశంలో తెలంగాణ ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ అక్కడి రైతులకు కరెంట్ ఇవ్వకుండా గోస పెడుతుంది. మళ్లీ చీకటి రోజులు రావాలని కోరుకోవద్దు. ఆగమాగం కావద్దు అంటూ తన శైలిలో విమర్శలు చేేస్తున్నారు. ప్రతి సభలో బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలు చెబుతూనే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు. ఒకవేళ ఒడగొడితే రెస్ట్ తీసుకుంటాం. అంతే గానీ తామే తెలంగాణను కాపాడే అసలైన నాయకులమని అంటున్నారు. తెలంగాణ లో మళ్లీ బీఆర్ ఎస్ గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. మరి తెలంగాణలో ఎవరూ అధికారంలోకి వస్తారో నెల రోజుల్లోనే తేలిపోనుంది.