పుకారు: ఆ గుర్తు కోసం కేసీఆర్‌ 1000ఎకరాలు రాసిచ్చారా?

Chakravarthi Kalyan
సీఎం కేసీఆర్ ఏదైనా అనుకున్నారంటే అది జరిగిపోవాల్సిందే. రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. బీఆర్ఎస్ గుర్తు కారు. అయితే దీనిని పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. రోడ్డు రోలర్, రోటీ మేకర్, ఆటో, రిక్షా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి. ఇవి చూడటానికి కారును పోలి ఉండటంతో గత ఎన్నికల్లో కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓట్లు ఈ గుర్తులపై పడ్డాయి. దీంతో బీఆర్ఎస్ ఆయా ఓట్లను కోల్పోయింది.


ఈ సారి అలా జరగకూడదని ఈ గుర్తులను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అటునుంచి నరుక్కొద్దాం అనుకున్నారు ఏమో రోడ్డు రోలర్ గుర్తు కలిగిన యుగ తులసి పార్టీ చీఫ్ శివ కుమార్ ని ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు.


శివకుమార్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. యుగ తులసి పార్టీ నామమాత్రంగా అంటే 5 శాతం సీట్లలో పోటీ చేసేలా ఒప్పించారని ప్రగతి భవన్ సమాచారం. దీంతో పాటు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో దాదాపు 1005 ఎకరాలను గోశాలకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎకరం రూ. కోటి చొప్పున లెక్కలు వేసుకున్నా.. వెయ్యి కోట్లు ఇంత భారీ మొత్తం కేసీఆర్ శివకుమార్ కు ఇస్తారా..  ఆయనకు అంత సీన్ ఉందా..


మరోవైపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ చెప్పారట. సీఎం నుంచి భరోసా పొందిన తర్వాతే శివ కుమార్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. అయితే ఈ హామీలు, పోటీ కేవలం ప్రచారం మాత్రమే. కేసీఆర్ అవసరమైతే మొండిగా వెళ్తారు తప్ప 1005 ఎకరాలను ఇవ్వడానికి సిద్ధపడరు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఎన్నికల సమయం కాబట్టి మనం దేనిని నమ్మలేం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: