ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగం.. చాలా కష్టం గురూ?

Chakravarthi Kalyan
కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకుని కార్పొరేట్ కంపెనీల్లో పని చేసుకుంటున్న వారు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని అనుకుంటారు. ఎందుకంటే ప్రైవేటు ఉద్యోగాల్లో టార్గెట్ లు పెడుతుంటారు. చాలా సార్లు సూపర్ వైజర్లతో ఇబ్బందులు తప్పవు. ఏ మాత్రం అటు ఇటు అయినా వారితో తిట్ల దండకం తప్పదు. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే హాలిడేస్ తో పాటు వివిధ అవకాశాలు ప్రమోషన్లు ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా ఈజీ అని అనుకుంటారు. కానీ అందులో ఉండే ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే విధమైన ఇబ్బందులు సచివాలయ ఉద్యోగులు పడుతున్నారు. ప్రతి డిపార్టుమెంట్ కూడా సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపాలిటీ లాంటి డిపార్ట్ మెంట్లు కూడా సచివాలయ ఉద్యోగులను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సచివాయల ఉద్యోగులను ఇష్టారీతిన వాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీనికి తోడు ఆయా డిపార్ట్ మెంట్లలోని ప్రభుత్వ ఉద్యోగులు తమకు అనుకూలంగా పని చేయాలని సచివాలయ ఉద్యోగులను హింస పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం కోసం నిజాయితీగా పని చేయాలని అనుకుంటున్న వారు కూడా ఈ ఉద్యోగం వద్దు బాబోయ్ అనుకుని మానేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

రామచంద్రపురం నుంచి ఒక సచివాలయ ఉద్యోగి కలెక్టర్ కు తన రాజీనామా లెటర్ ను పంపినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అనేక రకాలుగా సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నట్లు ఆయన తన సన్నిహితులు వద్ద వాపోయినట్లు సమాచారం. కాబట్టి ఇక తన ఉద్యోగానికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లెటర్ పంపడంతో సచివాలయ ఉద్యోగుల కష్టాలు బహిర్గతమయ్యాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే వారు ఎవరైనా సరే వారి స్థాయిలో ప్రెషర్ ఉంటుంది. కానీ మొత్తం ఒకే డిపార్ట్ మెంట్ పై మోపడం అనేది సరికాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: