జైల్లో బాబును చంపేందుకు దోమలతో కుట్ర?

Chakravarthi Kalyan
టీవీ 5 సాంబ శివరావు, మహా టీవీ వంశీ ఇద్దరు జర్నలిస్టుల కంటే చంద్రబాబుకు వీరాభిమానులు అని అందరికీ తెలిసిందే. చంద్రబాబు మానస పుత్రులు అని అనుకుంటున్నారు. చంద్రబాబుకు సంబంధించి సాంబశివరావు మరీ దారుణంగా మాట్లాడుతున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎవరు ట్రోల్ చేస్తున్న పట్టించుకోవడం లేదు. ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో రాధాకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తల కంటే ఆయనఅరెస్టు విషయంలో వీరు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చంద్రబాబు కు జైల్లో దోమలు కుడుతున్నాయి. వీటిని కావాలనే ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు. ట్రోల్స్ చేసి తీవ్రంగా అవహేళన చేస్తున్నారు.

దోమలు కుట్టకుండా దోమల స్ప్రే చేయించాలని అడగడంలో తప్పు లేదు. కానీ ఏకంగా దోమలనే జైల్లోకి ప్రభుత్వం పంపుతుందని చెప్పడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంతలా దిగజారి జర్నలిజం పరువు తీయాలా అని చర్చించుకుంటున్నారు. అభిమానం ఉండొచ్చు.. అధికారంలోకి వస్తే వారితో పని పడొచ్చు. కానీ మరి దిగజారి మాట్లాడి పరువు తీసుకోవడం తప్ప చేస్తుందేమీ లేదు.

జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఇంటి భోజనం ఇవ్వొద్దని ఎర్రంనాయుడు, అశోక గజపతి నాయుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. జగన్ కు అయితే ఒక న్యాయం.. చంద్రబాబుకు అయితే మరో న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంటి భోజనం ఇతర సదుపాయాలు లేకుండా జగన్ దాదాపు ఆరు, ఏడు నెలల పాటు ఉన్నారు. తర్వాత న్యాయస్థానం ఆదేశాల మేరుకు ఇంటి భోజనం వచ్చింది. కానీ టీడీపీ చేస్తున్న దిగజారుడుతనానికి చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు నారా లోకేశ్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అయితే ఇటీవల జైల్లో ఓ ఖైదీ డెంగ్యూతో చనిపోయాడని.. అందుకే తమకు చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన ఉందని లాజిక్‌తో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: