ఎలాన్‌ మస్క్‌ను చంపేస్తారా? ఎందుకు?

Chakravarthi Kalyan
ఎలన్ మస్క్ హత్యకు కుట్ర పన్నారని ఇటీవల ఆయన తండ్రి ఆరోపించారు. జార్జి సోరస్ సంస్థ అదానీ సంస్థలపై చేసిన కుట్రలాగా ఇది సాగుతుందని తెలుస్తోంది. జార్జి సోరస్ కు మీడియా, అధికారులు అందరూ సహకరిస్తారు. న్యూయార్క్ క్లర్ట్ అనే అమెరికా పత్రిక ఎలన్ మస్క్ ను టార్గెట్ చేసింది. ఎలన్ మస్క్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నాడని అమెరికా చెప్పిన మాట వినడం లేదు. బైడెన్ ను గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు.

మొట్ట మొదటి రష్యా ఉక్రెయిన్ యుద్దం సమయంలో శాటిలైట్లను ఉచితంగా అందజేసిన వ్యక్తి ఎలెన్ మస్క్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దారి తప్పి చేస్తున్న పనుల వల్ల దాన్ని ఉపసంహరించుకున్నాడు. ముఖ్యంగా అతడు అందజేసిన సాయం ఉక్రెయిన్ ను కాపాడటానికి కానీ రష్యాను విధ్వంసం చేయడానికి అమెరికా, యూరప్ దేశాలతో ఉక్రెయిన్ ఏకంగా రష్యాలోని అంతర్గత భాగాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.

రష్యా లోపల ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి ఉక్రెయిన్ భావిస్తుండటంతో ఉక్రెయిన్ కు కావాల్సిన సాయాన్ని మస్క్ చేయడం లేదు. దీంతో జార్జి సోరస్ బృందం రంగంలోకి దిగింది. కొత్తగా వార్తను సృష్టించాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడని మస్క్ పై నిరాధర ఆరోపణలు చేస్తూ మస్క్ హత్యకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆయన తండ్రి ఎరోస్ మస్క్ ఆరోపించారు.

జార్జి సోరస్ కుట్ర ఎలాంటిదో ఇండియాలోని అదానీ సంస్థలను అడిగితే అందరికీ తెలుస్తుంది. చాలా తీవ్ర మైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి అదానీ లాంటి వ్యక్తినే టార్గెట్ చేసిన సంస్థ అమెరికాలోని జార్జి సోరెస్ ది. కానీ ఈసారి ఏకంగా అమెరికాకు చెందిన ఎలన్ మస్క్ నే టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: