తెలుగు రాష్ట్రాల్లో దొంగ సర్వేల జోరు?
వచ్చే ఎన్నికల్లో 35 నుండి 50 అసెంబ్లీ స్థానాల వరకు మాత్రమే వైసీపీ పరిమితమై పోతుందని, అలాగే 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే వైసీపీకి గెలిచే అవకాశం ఉందని మరో రెండిట్లో మరికొంచెం అవకాశం ఉందని ఈ సర్వే చెప్తున్నట్లుగా చూపించుకుంటూ వస్తున్నారు. కర్నూల్ రిపోర్టర్ ద్వారా నడిచే దిశా అనే పేపర్ లో ఐప్యాక్ వాళ్ళ సర్వే ఇది అని ఈ వివరాలను చెప్పుకుంటూ వస్తున్నారని తెలుస్తుంది.
అయితే ఇదంతా నిజం కాదని సాక్షాత్తు ఐప్యాక్ సంస్థ వాళ్లే ప్రకటించడం ఇప్పుడు సంచలనాన్ని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు వరకు ఐ ప్యాక్ సంస్థ వెల్లడించిన ఫలితాలు అని చెప్పినవేవీ నిజానికి ఐ ప్యాక్ వి కాదు అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక మీడియా వర్గం తమ సంస్థ పేరుతో ఫేక్ రాజకీయ ఫలితాలను వెల్లడిస్తుందని, నిజానికి వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఐ ప్యాక్ తాజాగా ప్రకటించింది.
తమ పేరుతో మీడియా వర్గాల్లో గాని, సోషల్ మీడియా వర్గాల్లో గాని రిలీజ్ అయిన ఏ సర్వే కూడా తమది కాదని ఆ సంస్థ తాజాగా చెప్పింది. ఇలాంటి వార్తలు నిరాధారితమైనవని, మేము ఇప్పటివరకు ఎటువంటి సర్వేలను విడుదల చేయలేదని తేల్చి చెప్పింది. ఈ లెక్క బట్టి చూస్తే ఈ మధ్య ఒక పార్టీ అధ్యక్షుడు ఈ సంస్థ సర్వే పేరుతో వైసిపి వాళ్లు ఓడిపోబోతున్నారని చెప్పడం కూడా ఇలాంటిదే అని అంటున్నారు.